శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్మార్ట్ పల్స్ సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినూత్నరీతిలో ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించేందుకు నిర్దేశించిన ప్రజాసాధికారిత సర్వేను సమర్థవంతంగా నిర్వహించేందుకు నియమించిన సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని మేయర్ అబ్దుల్ అజీజ్ సూచించారు. శుక్రవారం స్మార్ట్ పల్స్ సర్వేను హరనాధపురంలో మేయర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నరీతిలో ప్రజాసాధికారిత సర్వేను ప్రవేశపెట్టి అమలుచేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేకుండా తాజా సమాచారం డోర్ నెంబర్లు, ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్లు, రేషన్ కార్డు, ఆదాయం, కుల, పుట్టినతేదీ, పింఛన్, వయస్సు తదితర అన్ని విషయాలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో 317 మంది ఎన్యుమరేటర్లు, 32మంది సూపర్‌వైజర్లను నియమించడం జరిగిందన్నారు. రాష్ట్రం మొత్తం మీద 35వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ సర్వేలో ఎన్యుమరేటర్లు సర్వే కొరకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు వారికి సహకారం అందించి పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ జానకి మాట్లాడుతూ స్మార్ట్ పల్స్ సర్వే కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసి సర్వే ద్వారా సామాజిక, ఆర్థిక, విద్య, వ్యవసాయం, ఆధార్, రేషన్, గ్యాస్, కుల, ఆదాయం, పింఛన్, పుట్టిన తేదీ తదితర అంశాలకు సబంధించిన స్థితిగతులను సేకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర, నెల్లూరు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, మంత్రి ఓఎస్‌డి పెంచలరెడ్డి, స్మార్ట్ సర్వే ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.