శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నీరు-చెట్టుపై విమర్శలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జూలై 12 : నీరు-చెట్టు పనులలో అవినీతి జరిగిందని ప్రతిపక్ష నాయకులు అర్థరహిత విమర్శలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని కంటేపల్లి గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జెర్రిపోతు వాగు వెల్లువ కాలువను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంది జగన్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గతంకన్నా మెరుగ్గా అమలు చేస్తుంటే వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు గడప గడపకు వైసిపి అని వెళ్లి ఏమి చెబుతారని ఆయన ప్రశ్నించారు. ముందు మీ అధినేత ఆస్తులను ఎందుకు జప్తు చేశారో ప్రజలకు విరించాలని ఆయన వైసిపి నాయకులకు సూచించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీరు-చెట్టు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెండర్లు పిలిచి కాలువ పనులు గుత్తేదారులకు అప్పగిస్తే అన్ని పనులను ఒకరే దక్కించుకుని నాశిరకంగా పనులు చేస్తారని, అందుకే సాగునీటి సంఘాలను, రైతులను భాగస్వాములను చేసి వారి ఆధ్వర్యంలో పనులు సక్రమంగా, రైతులకు అవసరమైన విధంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నీరు-చెట్టులో అక్రమాలకు పాల్పడినా, నాశిరకంగా చేసినా సహించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పనులు నిబంధనల మేరకు నాణ్యతతో చేయాలని చెప్పారు. రైతుల అవసరార్థం జిల్లాలో 600 వరకు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతు సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రతిపక్ష నాయకులు నీరు-చెట్టు పనులను రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్లి నీరు-చెట్టు పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నాగేంద్రప్రసాద్, సర్వేపల్లి కాలువ ఛైర్మన్ ఈదూరు రామ్‌మోహన్‌రెడ్డి, గొలగమూడి సాగునీటి సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, నాయకులు ఆస్తోటి నాగారాజు పాల్గొన్నారు.