శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఏప్రిల్ 7: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె హేమామహేశ్వరరావు అన్నారు. గురువారం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం, రైతు నేస్తం ఫౌండేషన్, ప్రకృతి వనం, భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 3న తిరుపతిలో బయలుదేరిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ చైతన్యయాత్ర గూడూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక టవర్‌క్లాక్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో జెడి పాల్గొని ప్రసంగించారు. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలో ఆత్మవిశ్వాసం నింపేందుకు, ఆత్మహత్యలు లేని అన్నపూర్ణను ఆవిష్కరించేందుకు, ఒక్క గోవుతో 10 ఎకరాల ప్రకృతి వ్యవసాయం సాగు చేయడాన్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి అన్ని పంటల్లో పెట్టుబడులు తగ్గించుకొనేందుకు ఇది ఎంతగానో ఎంతగానో దోహదపడుతుందన్నారు. హరిత విప్లవం పేరుతో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల భూమిలో ఉన్న జీవరాసులు నాశనమయ్యాయని అన్నారు. జీవరాశి, పశు పక్షాదులకు సంబంధించిన ప్రకృతి సిద్ధమైన ఆహార చక్రాలు ధ్వంసమయ్యాయన్నారు. భూమిలోని జీవన ద్రవ్యాన్ని హరింప చేసి భూములను నిస్సారం చేస్తున్నామన్నారు. జీవవైవిధ్యం, నాశనమైందని, వాతావరణం కలుషితమై భయంకర రోగాలు ప్రబలి చివరకు తల్లిపాలు కూడా విషతుల్యమయ్యే పరిస్థితి ఈ రసాయిన, క్రిమి సంహారక మందుల వాడకం వల్ల ఏర్పడిందన్నారు. అందువల్ల ప్రకృతి సహజ సిద్ధమైన వాటిని వాడి అధిక దిగుబడులు సాధించి భూమిని సారవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి, నాగరాజు, రామ్మోహన్, యుగంధర్, గూడూరు, వెంకటగిరి వ్యవసాయ శాఖ ఎడిఇలు, ఎవోలు, ఎఆర్‌డి సంస్థ డైరక్టర్ బషీర్, బిజెపి నాయకుడు ఎం రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు పట్టణంలో చైతన్యయాత్ర నిర్వహించారు.