శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సురేష్‌ప్రభు నోట ‘జై ఆంధ్రప్రదేశ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 24: నెల్లూరుకు తొలిసారి వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తన ప్రసంగంలో స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన ప్రసంగం చివరలో ‘జై హింద్, జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించడంతో సభా ప్రాంగణంలో చప్పట్లు మోగాయి. తన ప్రసంగంలోనూ అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు వారిని పొగిడేందుకు ఆయన ఉత్సాహం చూపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి సామర్థ్యం, లీడర్‌షిప్ ప్రపంచానికి తెలియచేస్తారని అన్నారు. అమెరికాలో దేశంలోని ఎన్నో ప్రాంతాల ప్రజలు ఉంటూ తమ తమ ప్రాంత సంఘాలుగా ఉన్నారని, అయినప్పటికి అమెరికాలో తానా పేరు మోగినంతగా దేశంలోని మరే ప్రాంతానికి చెందినవారి సంఘాలకు పెద్ద ప్రాధాన్యత కనిపించదన్నారు. తనను ఆంధ్రప్రదేశ్ దత్తత తీసుకుందని, తాను ఈ కొత్త రాష్ట్రానికి దత్తపుత్రుడినని ఆయన అనడంతో సభలో నవ్వులతో పాటు హర్షాతిరేకాలు కనిపించాయి. ఇలా ఆద్యంతం తనదైన శైలిలో తెలుగువారి మనసులు దోచుకునేందుకు ప్రయత్నిస్తూ తాను ఈ ప్రాంతానికి ఏమిచేయగలనో చెప్పే ప్రయత్నం మంత్రి చేశారు. సాధారణంగా వెంకయ్యనాయుడు ఉన్న సభలో మరో నేత ప్రసంగానికి ఆశించినంత సభికుల్లో స్పందన కనిపించదు. కానీ ఆదివారం నాటి సభా కార్యక్రమంలో వెంకయ్యనాయుడి ప్రసంగంకన్నా సురేశ్ ప్రభు ప్రసంగానికే స్పందన లభించడం విశేషం.