శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నడికుడి - కాళహస్తి పనులు పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 24: నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే పనులను త్వరితగతిన పూర్తిచేసేలా నిధులు కేటాయించాలని కోరుతూ నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరుకు విచ్చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఆదివారం వినతిపత్రమిచ్చారు. తిరుపతి-షిర్డీల నడుమ వారానికొకసారి తిరిగే ఎక్స్‌ప్రెస్ రైలును వారానికి మూడుసార్లు తిరిగేలా చూడాలని కోరారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలను మార్పు చేయాలని సూచించారు. గరీబ్థ్,్ర కోరమాండల్ తదితర సూపర్‌ఫాస్ట్ రైళ్లను నెల్లూరులో నిలుపుదల చేయాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, త్వరలో ఎయిర్‌పోర్టు ఏర్పడనున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని దూరప్రాంత సూపర్‌ఫాస్ట్ రైళ్లకు నెల్లూరులో హాల్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కావలిలో యశ్వంతపూర్, శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఏర్పాటు చేయాలని, నెల్లూరు స్టేషన్‌ను ఏ 1 గ్రేడ్‌గా మార్చాలని వినతిపత్రంలో మేకపాటి కోరారు.