శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజల్లో ‘అణు’ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, జూలై 24 : నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయని వార్తలు వస్తుండగా ప్రజల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వంటి నాయకులతోపాటు ప్రజాసంఘాలు దీనిపై తీవ్రంగానే స్పందించాయి. ఆదివారం తాజాగా శాస్ర్తియ విషయాలపై ముందుండి ప్రజలకు అవగాహన కల్పించే జనవిజ్ఞాన వేదిక నాయకులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించగా అణు ప్రాజెక్ట్ వద్దే వద్దంటూ ముక్తకంఠంతో తీర్మానించారు. జెవివి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు ఎన్‌జె వర్మ, టివి ఎంఎన్ ప్రకాశరావు, కె సుబ్బయ్య, ఐ సాయిప్రసాద్, బాలాజీ, రమేష్ తదితర సభ్యులు పాల్గొని మాట్లాడారు. రష్యా దేశంలో 1986 సంవత్సరంలో చెర్నోబిల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాన్ని ఉటంకించారు. రేడియో ధార్మికత గాలిలోకి కలిసిన కారణంగా వేలాదిమంది ఆ క్షణాల్లోనే మృతి చెందగా అనేక లక్షల మంది థైరాయిడ్, పలు కాన్సర్‌ల బారిన పడిన విషయాన్ని గుర్తుచేశారు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందున్న అగ్ర రాజ్యమైన రష్యాలోనే ప్రమాదాన్ని అదుపుచేయలేక జన నష్టం జరిగిందని, అదే దేశం అమ్ముతున్న రియాక్టర్ నిర్వహణ మన ప్రాంతంలో ఎంతమాత్రం సురక్షతమో ఆలోచించాలన్నారు. ప్రపంచానికి టెక్నాలజీని విక్రయించే జపాన్ దేశంలో సునామీ సమయంలో అణు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. మన నేతల కమీషన్లు, ఇతర దేశాల వ్యాపారాల కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వృద్ధి చేసుకోవాలని, అణు విద్యుత్‌పై ఆధారపడే విషయాన్ని, ఆలోచనలను విడనాడాలని హితవు పలికారు. దీనిపై తమ సంస్థ ఆధ్వర్యంలో జనజాగృతి కార్యక్రమం చేపడతామన్నారు. ఈ సమావేశంలో సభ్యులు కోటేశ్వరరావు, సుధాకర్, ప్రసాద్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.