శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైల్వేపరంగా నెల్లూరుకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 24: రైల్వేపరంగా నెల్లూరు జిల్లాకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో జిల్లాలోని గూడూరు, నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన, మరో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం కష్టపడుతున్న సీనియర్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వస్థలమైన నెల్లూరు ప్రయోజనాలు కాపాడేందుకు ఇకపై కృషి చేస్తానని ఆయన సభాముఖంగా హామీనిచ్చారు. రైల్వే, పోర్టుల అనుసంధానానికి ప్రధానమంత్రి ప్రాధన్యత ఇస్తున్నారనీ, ఆయన ఆలోచనలకు అనుగుణంగా రైల్వే శాఖ పనిచేస్తూ దేశంలోని పోర్టులను రైల్వేతో అనుసంధానానికి చర్యలు తీసుకుంటోందన్నారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైనుకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేస్తూ త్వరలో మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు. జిల్లాకు చెందిన నెల్లూరు, తిరుపతి ఎంపీలు రైల్వే పరంగా కొన్ని ప్రతిపాదనలతో తరచూ కలుస్తుంటారని, వారి ప్రతిపాదనలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు స్టేషన్‌లోనూ వై ఫై సౌకర్యం
నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లోనూ త్వరలోనే వై ఫై సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు రైల్వే అధికారులను కోరారు. గతంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే నెల్లూరు- చెన్నై తిరుపతి మెము రైళ్లను, వేదాయపాలెం స్టేషన్ అభివృద్ధి, నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ తూర్పు విభాగాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. కొత్తగా రైళ్లను కేటాయించడం కంటే శిథిలమైన శిలాఫలకాలకు మోక్షం కల్పించడమే బాధ్యతగా రైల్వే బడ్జెట్ రూపుదిద్దుకుందని కొనియాడారు. నెల్లూరు, బిట్రగుంట, గూడూరుల్లోని రైల్వే స్థలాలను కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని, వారిని తొలగింపచేసి అక్కడ ప్రయోజనకరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం భవనాలను నిర్మించాలని రైల్వే శాఖకు సూచించారు. కేంద్ర మంత్రులను జిల్లాకు తీసుకురావడం వల్ల వారికి ఇక్కడి సమస్యలు అర్థమై వారిచ్చే హామీల ద్వారా జిల్లాకు లాభం చేకూర్చడమే తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల మార్పు గురించి తాను రైల్వే అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లా సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నుంచి సహాయాన్ని పొందాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఏడాదిలోగా పనులు పూర్తి
నెల్లూరులో కేంద్ర మంత్రులు రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రారంభించిన అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తిచేయాలని నిర్దేశించుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గూడూరులో 4వ ఫ్లాట్‌ఫాంను రూ.1.20 కోట్లు, స్థానిక రైల్వేయార్డ్‌ను ఆధునీకరించేందుకు రూ.13.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా నగరంలోని సౌత్ రైల్వేస్టేషన్‌లో నిర్మించేందుకు శ్రీకారం చుట్టిన పాదచారుల వంతెనను కూడా ఈ ఏడాది చివరకు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ, నెల్లూరు తిరుపతి ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.జానకి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా, విజయవాడ డిఆర్‌ఎం అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.