శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పిఎఫ్ రుణం మంజూరులో సిబ్బంది చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, జూలై 26: కావలి మున్సిపల్ కార్మికులు కొంతమంది పిఎఫ్ ఖాతాపై రుణాలకోసం దరఖాస్తు చేసుకోగా రుణ మంజూరుకు కడప పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది లంచం కోసం వేధిస్తూ కొంతకాలంగా తిప్పుకుంటున్నారు. ఒక్కొక్కరికి 3 వేల రూపాయల వంతున డిమాండ్ చేస్తుండగా దాదాపు 60 మంది వరకు కార్మికులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఈ నేపధ్యంలో తమ బాధను అనుబంధ ఎఐటియుసి నేతలు డేగా సత్యనారాయణ, నీలం వెంకటేశ్వర్లుకు చెప్పుకోగా వారు జిల్లా ఎసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ సహకారంతో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐని ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న సిబిఐ వల పన్ని నిఘా ఉంచింది. సోమవారం ఉదయం కావలికి వచ్చిన ముగ్గురు సిబిఐ ఇన్స్‌పెక్టర్‌లు, మరో ముగ్గురు సిబ్బంది బాధితుల్లో ఒకరైన కార్మికుడు మల్లి అంకయ్య, నాయకులు డేగా సత్యనారాయణతో పాటు మరికొందరిని వెంటబెట్టుకుని కడప నగరానికి తీసుకెళ్లారు. తాము నగదుతో వస్తున్నట్లు మందుగానే పిఎఫ్ అధికారులకు సమాచారం ఇవ్వగా విధి నిర్వహణలో ఉన్న కార్యాలయ ఉద్యోగి దానయ్య బాధిత కార్మికుడు మల్లి అంకయ్య నుంచి లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులకు పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న వారు పిఎఫ్ రికార్డులతో సహా విశాఖ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. ఈ మేరకు కావలి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఎఐటియుసి నేతలు విలేఖర్లకు వివరాలు తెలియజేశారు.
వేధింపులకు తాళలేకే సిబిఐని ఆశ్రయించాం
అవసరాల కోసం చేసే రుణాలకు కూడా లంచాలు ఇవ్వాల్సి రావడం, అదీ తామేదో వారికి అప్పు అన్నట్టుగా మాట్లాడుతుండటం వంటి కారణాలతో చివరికి ఎసిబి వారి సూచనలతో సిబిఐని ఆశ్రయించామని కార్మికులు, నేతలు స్పష్టం చేశారు. కావలి మున్సిపల్ కార్యాలయ పిఎఫ్ గుమస్తా వద్ద నుంచి పంపిన తమ దరఖాస్తులను కడప పిఎఫ్ కార్యాలయ అధికారులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచి రుణ మంజూరుకు పొంతనలేని కారణాలు చెప్తున్నారని, స్థానికంగా ఉన్న వారి ఏజెంట్లు అదే చెప్తున్నారని తెలిపారు. విధిలేక తాము నెల్లూరు ఎసిబి డిఎస్పీ తోట ప్రభాకర్‌ను ఆశ్రయించామని, అయితే కడపలోగల కార్యాలయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాగా వారి సలహాతో సిబిఐ ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చామన్నారు. ముందుగా ఐదుగురు కార్మికులకు రుణం దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారి దానయ్యకు రూ.15 వేలు ఇచ్చే ఒప్పందంతో నేరుగా ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేయగా రుణం మంజూరైందన్నారు. అలా తమపై నమ్మకం కలిగేలా చేసి మరో మూడు దరఖాస్తులకు సంబంధించి తాము నగదుతో వస్తున్నామని చెప్పి సిబిఐ అధికారులతో కలిసి వెళ్లగా తాము లంచం సొమ్ము ఇస్తుండగా అధికారులు పట్టివేశారని తెలిపారు. అక్కడ సరైన కారణాలు లేకుండా కేవలం లంచాల కోసం పెండింగ్‌లో ఉంచిన కావలి మున్సిపల్ కార్మికులకు చెందిన 47 దరఖాస్తులను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకుని తమతో తీసుకెళ్లారని చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలోగల కడప పిఎఫ్ కార్యాలయంలో భారీగా అవినీతి జరుగుతోందని చెప్తు విచారణకోసం అధికారులు కావలికి కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయం కావలి పట్టణంలో సంచలనం కలిగించింది. కార్మికుల పిఎఫ్ రుణ దరఖాస్తులను తాము సంబంధిత కార్యాలయానికి పంపడం మినహా మంజూరులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్థానిక మున్సిపల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.