శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సర్వే సమగ్రంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జూలై 26: ప్రజాసాధికారత సర్వే సమగ్రంగా, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ నెల్లూరు ఆర్‌డిఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఉన్న అధికారులను ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆకస్మికంగా వెంకటేశ్వరపురం, బోడిగాడితోట ప్రాంతాల్లో సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్రంగా కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఆధారాలతో నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఈ సర్వేని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని, అందువల్ల అధికారులు ప్రజలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. డివిజన్‌కు సంబంధించిన ఏమైనా ఫైళ్లు కలెక్టరేట్‌లో ఆలస్యమవుతుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలు తీర్చటం కోసం అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వంలో భాగమే అధికారులని, వారి సమస్యలు తీర్చినప్పుడే అధికారుల బాధ్యత తీరినట్లు అని ఆయన అన్నారు. సర్వే విషయంలో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఈ సర్వేవల్ల అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యధావిధిగా అందుతాయని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నెల్లూరు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.