శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కుటుంబ నియంత్రణ కుంటినడక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జనవరి 21: కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల వ్యవహారం జిల్లాలో కుంటుపడుతోంది. గత కొనే్నళ్లుగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యం ఏటేటా తగ్గిపోతుండటం గమనార్హం. మూడేళ్ల క్రితం వరకు 24 వేల శస్తచ్రికిత్సలు కాగా, ఇరవై వేలకు మించి శస్తచ్రికిత్సలు చేయలేకపోతూ వచ్చారు. దీంతో ప్రభుత్వమే ఆ లక్ష్యాన్ని 20,900గా తగ్గుముఖం పట్టించింది. అయినా దిగదుడుపు దుస్థితే దాపురిస్తోంది. మార్చి నెలాఖరునాటికే ఈ లక్ష్యాన్ని చేధించాలి. అలా వీలుపడకపోవడంతో మరో పక్షం రోజులు తరువాత ఆర్థిక సంవత్సరంలోకి కాలాన్ని అదనంగా వెసులుబాటు కల్పించిన దాఖలాలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సంచితరీతిలో సాధించిన లక్ష్యం 81 శాతం వరకే ఉందని సాక్షాత్తు జిల్లా వైద్యారోగ్య అధికారే చెప్పుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని చేధించాల్సిన భారం పెంచుకుంటూ కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల పురోగతి క్రమాన్ని అపహాస్యం చేస్తున్న వైనం గతంలోనూ వివిధ సందర్భాల్లో జిల్లా అధికార యంత్రాంగానికి అనుభవమే.
వేసక్టమీపై ప్రచారం ఏదీ ?
వేసక్టమీపై జిల్లాలో ప్రచారపర్వం అటకెక్కింది. ఇందులో నోస్పాల్కెల్ వేసక్టమీ (ఎన్‌ఎస్‌వి) విస్తృతం చేస్తున్న దాఖలాల్లేవు. కోత, కుట్టు వంటివి లేకుండా సులభతరంగా సాగే ఈ చికిత్సా ప్రక్రియను అమలుచేసే వైద్యుల సంఖ్య బహు అరుదు. దీంతో జిల్లాలో గత ఏడాది నిర్వహించిన 22వేల కు.ని శస్తచ్రికిత్సల్లో కేవలం 54 మాత్రమే వేసెక్టమీలు. మిగిలినవన్నీ ట్యూబెక్టమీలే (మహిళలకు నిర్వహించే కు.ని శస్తచ్రికిత్సలే). కుటుంబ నియంత్రణ పేరిట తమ ఆరోగ్యానే్న ఫణంగా పెడతారా అనే నారీలోకం ప్రశ్నకు వైద్యారోగ్య వద్ద మానవీయ కోణంలో స్పందించడం లేదు. ఏదేమైనా వేసెక్టమీల్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం వైద్యారోగ్యశాఖపై ఉంది. ఈ శస్తచ్రికిత్సలపై పామరజనంలో ఉన్న అపోహలు తొలగిపోయేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వైద్యారోగ్యశాఖలో వివిధ స్థాయిల సిబ్బంది క్రమేపి నిర్లక్ష్యభావం పెంచుకుంటున్నారు. గ్రామాల్లో తాత్కాలిక భృతితో సేవలందించే ఆశా వాలంటీర్ల ఆధారంగానే అంతంత మాత్రపు లక్ష్యసాధన అయినా చేయగలుగుతున్నారని విశే్లషణ. ఇంతేగాక గతంలో నిర్వహిస్తున్న మెగా శస్తచ్రికిత్సా శిబిరాల హడావుడి విడనాడారు. ఇలాంటి మెగా శస్తచ్రికిత్సా శిబారాల్ని నిర్వహించడంతో సహా అదే సందర్భంలో స్థానికంగా వివిధ రంగాల్లోని వదాన్యుల్ని గుర్తెరిగి వారిని ఆశ్రయించడం ద్వారా ప్రైవేట్ ప్రోత్సాహక బహుమతుల్ని అందజేసే ప్రక్రియను పునరుద్ధరించాలి. తద్వారా కు.ని శస్తచ్రికిత్స లక్ష్యసాధన అధిగమించాల్సిన అవసరం ఉంది. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఏటా లక్ష్య సాధన కోసమై ప్రత్యేక మెగా కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్స శిబిరాలను నిర్వహిస్తుండేవారు. అదే సందర్భంలో పలువురు దాతల్ని ప్రోత్సహించి కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్స చేయించుకున్న వారికి ప్రభుత్వం ఇచ్చే నజరానాలతో సహా ప్రత్యేక కానుకల్ని అందజేస్తుండటం పరిపాటి. ప్రస్తుతం అలాంటి మెగా కు.ని శిబిరాలు నిర్వహించడాన్ని విస్మరిస్తున్నారు. అంతూదరి లేకుండా పెరిగిపోతున్న భారతావని జనాభాను అరికట్టడంలో జిల్లా వైద్యాధికార యంత్రాంగం తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. నెల్లూరుకు పొరుగున ఉన్న ఇతర జిల్లాల్లో మాత్రం లక్ష్య సాధనలో అక్కడి వైద్యారోగ్యశాఖ యంత్రాంగాలు సఫలీకృతమవుతున్నాయి. కు.ని లక్ష్య సాధనలో నెల్లూరుజిల్లా వైద్యారోగ్యశాఖ అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతున్నా వీరిని దారిలో పెడుతున్న పాలకులు లేకపోవడం శోచనీయం. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న జిల్లా వైద్యారోగ్య అధికారి ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందున్న అధికారికి అసమర్ధత ముద్రపడింది. అంతకుమందు కూడా నెల్లూరు డిఎంహెచ్‌ఓ అంటే స్థిరత్వం లేకుండా పోయింది.

రోడ్డున పడ్డాం, ఆదుకోండి
జగన్‌కు ఆరోగ్యమిత్రల వేడుకోలు
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 21: తమను ఉద్యోగాల నుండి అన్యాయంగా తొలగించటంతో రోడ్డున పడ్డామని ఆదుకోవాలంటూ వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డకి ఆరోగ్యమిత్రలు వేడుకున్నారు. గురువారం నగరంలోని జిల్లా కేంద్ర కారాగారం వద్ద ఆరోగ్యమిత్రలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకు స్పందించిన జగన్ మాట్లాడుతూ బాబు వస్తే జాబులు వస్తాయని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామనే మాటలకు కాలం చెల్లిందన్నారు. చంద్రబాబు మోసకారి మాటలకు ఆరోగ్యమిత్రల తొలగింపే నిదర్శనమన్నారు. చంద్రబాబు వారి ఆవేదనను అర్థం చేసికుని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఆందోళనలకు పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. అంతకుముందు జిల్లాలోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను గురువారం ఆయన ములాఖత్ తీసుకుని పరామర్శించారు. జగన్ వెంట ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, పి అనిల్‌కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, పాశం సునీల్‌కుమార్, రాపోలు రామచంద్రరావు, శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, మేరిగ మురళి, రూప్‌కుమార్ యాదవ్, దాసరి భాస్కర్ గౌడ్, మందల వెంకటశేషయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
వెంకటగిరి, జనవరి 21: కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వేతన సంఘం కన్నా ప్రస్తుత వేతన సంఘం దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులను నష్టపరిచే కార్మిక చట్టాలను నిలిపివేయాలని, రైల్వే ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎం శేషగిరిరావు, నాగరాజు, కుమార్, శ్రీనివాసులు, కోటి తదితరులు పాల్గొన్నారు.