శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జడ్పీ నిధుల్లో విద్యకే తొలి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 6: జడ్పీ నిధుల కేటాయింపుల్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని జడ్పీ కార్యాలయంలో జరిగిన స్థారుూ సంఘ సమావేశాల్లో ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే జడ్పీ నిధుల ద్వారా మార్గదర్శకాలు అందిస్తూ వస్తున్నామని, ఇకపై 8, 9 తరగతుల విద్యార్థులకు కూడా వీటిని అందించనున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల్లో డొల్లతనం కనిపిస్తోందన్నారు. వేసిన కొద్ది రోజులకే రోడ్లలో నాణ్యత దెబ్బతిని గుంతలమయంగా తయారవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని పిఆర్ అధికారులను హెచ్చరించారు. జడ్పీ నిధులతో చేపట్టిన పనులపై పూర్తి నివేదిక తయారుచేసి ఇవ్వాలని వారిని ఆదేశించారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రణాళికాబద్ధంగా నిధులను కేటాయిస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం బాలలకు సరిగా అందడం లేదని, అధికారులు తరచూ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. హాస్టళ్లలో మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాలని, కొత్తవి అవసరమైనచోట నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పరికరాలను, సంక్షేమ నిధులను రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికి అందేలా చూడాలని కోరారు. ఉపాధి హామీ కింద అర్హులైన వారికి పని దినాలు కల్పించాలని, కేవలం ఒక్క పార్టీ వారికే అవకాశం ఇవ్వడం సరికాదని హితవు పలికారు. కండలేరు నుంచి స్వర్ణముఖి నదికి నీటిని విడుదల చేయాలని సూచించారు. స్థారుూ సంఘ సమావేశాల్లో పూర్తిస్థాయి సమాచారంతో అధికారులు రావాలని, అరకొర సమాచారంతో సిద్ధం కావొద్దని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇఓ రామిరెడ్డి, ఏఓ వసుమతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, స్థారుూ సంఘ సభ్యులైన వెంకటాచలం, గూడూరు జడ్పీటీసి సభ్యులు వెంకటశేషయ్య, బి.పద్మజ పాల్గొన్నారు.

కౌన్సిల్ రద్దు చేయాలని డిమాండ్
డిప్యూటీ మేయర్ ముక్కాల డిమాండ్
నెల్లూరుసిటీ, ఆగస్టు 6: నెల్లూరు నగరపాలక సంస్థలో పిచ్చితుగ్లక్ పాలన సాగుతోందని, ఈ కౌన్సిల్‌ను వెంటనే రద్దు చేయాలని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, కార్పొరేటర్ రూప్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని డిప్యూటీ మేయర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు అధికారులు రావాలంటే భయపడుతున్నారని అన్నారు. నగరపాలక సంస్థలో ఏ అధికారి కూడా మేయర్ తీరుతో పనిచేయలేక దీర్ఘకాలిక సెలవు, బదిలీపై వెళ్లిపోతున్నారని అన్నారు. నగరపాలక సంస్థలో మేయర్, అధికారుల మధ్య సమన్వయం లేపోకవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. కార్పొరేటర్ రూప్‌కుమార్ మాట్లాడుతూ మేయర్ కమీషన్లకే పరిమితం కావడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. గత కొన్ని రోజుల క్రితం శానిటరీ ఇన్‌స్పెక్టర్ల బదిలీలను పారదర్శకంగా చేశామని చెప్పిన మేయర్ తిరిగి వారిని అదే స్థానంలో తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. నగరంలో ప్రజల సమస్యలపై చర్చిందుకు తక్షణమే కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని ఎన్నోసార్లు చెప్పినా ఇంతవరకు మేయర్ స్పందించక పోవడం దారుణమన్నారు. మేయర్‌కు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలంటే ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఊటూకూరు మాధవయ్య, వేలూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి నెల 9న గర్భిణులకు ఉచిత పరీక్షలు
డిఎంహెచ్‌ఓ వరసుందరం వెల్లడి
నెల్లూరుసిటీ, ఆగస్టు 6: ప్రతి నెల 9వ తేదీన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వరసుందరం తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వైద్య సంస్థలు సింహపురి, అపోలో, నారాయణ ఆసుపత్రుల వైద్యులచే వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షల ద్వారా అధికంగా ఉన్న హైరిస్క్ గర్భవతులను గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలను అందించడమే లక్ష్యమన్నారు. ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రులలో స్కానింగ్ పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. తల్లి, బిడ్డ సంరక్షణ ధ్యేయంగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందలరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిటిసిఓ సురేష్‌కుమార్, డిఐఓ జయసింహ, అదనపు వైద్యాధికారి డాక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
డక్కిలి, ఆగస్టు 6: మండలంలోని మహాసముద్రం గ్రామ చెరువు సమీపంలో శనివారం రాత్రి టాస్క్ఫోర్స్ డిఎస్‌పి హరనాథ్ ఆధ్వర్యంలో 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వెంట వెంకటగిరి సిఐ శ్రీనివాసులు, డక్కిలి ఎస్‌ఐ జిలాని, పోలీసు సిబ్బంది ఉన్నారు.