శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చేనేతకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, ఆగస్టు 11: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ (వాయిస్ ఆఫ్ ఇండిపెండెంట్) పేరుతో దేశంలోని 18 నగరాలలో చేనేత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏపీలోని నెల్లూరు నగరాన్ని కూడా ఎంపిక చేశారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి తెలిపారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటరులో గురువారం ఆల్ ఇండియా హ్యాండ్‌లూమ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర చేనేత అధ్యక్షుడు చక్రధారి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. చేనేత వస్త్రాలు, ఖాదీబండార్‌ల మీద, విద్యార్థులు, ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని వాటిని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగా దేశంలో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతిఒక్కరు ఖాదీ వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారని అన్నారు. ఈ మేరకు దేశంలో ఇప్పటికే 25 శాతం చేనేత వస్త్రాలను ప్రజలు కొనుగోలు చేశారని తెలిపారు. అలాగే చేనేత పరిశ్రమలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రైళు, విమానాలలో సీట్లు, కిటికీ కర్టన్లను చేనేత వస్త్రాలు వాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాబోయే కాలంలో మంత్రిత్వశాఖ ద్వారా చేనేత పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా రూ.6వేల కోట్ల పెట్టుబడులతో చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు ఆధునిక టెక్నాలజీతో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా పరికరాలను పంపిణీ చేసి పవర్‌లూమ్స్, మిల్లు వస్త్రాలకు దీటుగా చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్రబాబు, నగర అధ్యక్షుడు ఈశ్వరయ్య, కె.సుధాకర్‌రెడ్డి, బి.సుధాకర్, వై.రాజేష్, కె.మధు తదితరులు పాల్గొన్నారు.