శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మట్టి విగ్రహాలే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 3: వినాయకచవితి పండుగ సందర్భంగా జిల్లాలో విగ్రహాలు కొనుగోలు విషయంలో ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడంతో అటు ప్రజలు, ఇటు పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ ప్రతిమలను కొనుగోలు చేసేముందు ప్రతిఒక్కరు పర్యావరణం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే ఎంతో బాగుంటుందనేది పర్యావరణ ప్రేమికుల ఆలోచన. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వివిధ రంగులతో తయారుచేస్తారు. ఆ విగ్రహాలు నీళ్లల్లో కలిసే గుణం ఉండదు కాబట్టి వాటిలో వాడే కృత్రిమ రసాయనాల వల్ల నీటి కలుషితమే కాకుండా మన్ను కలుషితం అవుతుందని గొంతు చించుకుంటున్నా ప్రతి ఏడాది వచ్చే ఈ పండుగకు అటు రాజకీయ నాయకులు గాని, ఇటు అధికారులు గాని రోడ్ల మీద ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాల తయారీని అరికట్టకపోవడం బాధాకరం. విగ్రహాలకు వేసే రంగుల్లో కార్డ్మియం, సిలికాన్, పాదరసం, సీసం, కార్బన్, మాల్బిడి, హర్జినిక్, క్రోమియం వంటి లోహాలు కలసి ఉంటాయి. ఇవి భూమిలో ఇంకడానికి ఈ రసాయనాలు అడ్డుపడతాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహాన్ని తయారుచేసేటప్పుడు జిప్సం, సల్ఫర్, ఫాస్పరస్, మెగ్నీషియం ఉండడంతో ఇవి అనుకున్నంత సమయంలో నీళ్లలో కరగవు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా చూసేందుకు గణపయ్య విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయే కాని ఇవి పర్యావరణానికి పెనుముప్పుగా మారుతాయి. ఈ విగ్రహాలను నిమజ్జనం చేయగానే నీటిలో ఆమ్లత్వం పెరిగి భారజలాలల లోహాల సాంద్రత పెరిగి చేపలు వెనువెంటనే చనిపోతాయి. అలాగే నీటిలో ఉన్న మంచినీటి మొక్కలకు, వాటిని తిని బతికే జీవులకు పర్యావరణానికి ఈ రసాయనాలు ఎంతో హాని చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని గ్రామాలలోని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల శ్వాససంబంధ, చర్మ సంబంధ ఇబ్బందులు మనుషుల్లో తలెత్తే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతాయి. మనం ఆ నీటిని తాగకపోయినా ఆ నీటిలోని చేపను తిన్నా మన ప్రాణానికి ప్రమాదకరం. గణేష్ వేడుకల్లో కలిపిన రంగుల్లో ఉన్న కాపర్, రెడాక్సైడ్, సింథటిక్ రంగులతో కంటిచూపు పోతుందని అందువల్లనే మట్టితో వినాయకుడి ప్రతిమలు చేస్తే అటు ప్రజలకు, ఇటు పర్యావరణానికి ఎంతో మంచిది.

సూళ్లూరుపేట మున్సిపాల్టీలో నిధుల గోల్‌మాల్
కౌన్సిలర్ సుమంత్‌రెడ్డి ఆరోపణ
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 3: సూళ్లూరుపేట మున్సిపాలిటీలో పాలన అవినీతిమయంగా మారిందని, దానిని సరిచేసుకోవాలని సూచన చేస్తే చైర్‌పర్సన్ కుల రాజకీయాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదని కౌన్సిలర్ వేనాటి సుమంత్‌రెడ్డి హితవు పలికారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ జనరల్ ఫండ్‌ను పాలకవర్గం ఇష్టానుసారంగా బ్యాంకు నుండి లక్షలాది రూపాయలు డ్రా చేశారని దీనిని ప్రశ్నిస్తే ఆమె రాజకీయాలు గురించి మాట్లాడడం సరికాదన్నారు. ప్రజాధనం ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. జనరల్ ఫండ్ నుండి డ్రా చేసిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. 2015 డిసెంబరు 30న రూ.1.78 లక్షలు, ఈ ఏడాది జనవరి 30న రూ.1.78 లక్షలు, మరోసారి రూ,28వేలు, రూ.30 వేలును బ్లీచింగ్ పేరుతో డ్రా చేశారన్నారు. అదే విధంగా వనజ అనే పేరుపై సెల్ఫ్ చెక్‌తో రూ.4.50 లక్షలు డ్రాచేసి ఉండడమే కాకుండా స్థానిక హోలిక్రాస్ రోడ్డు నుండి అయ్యప్ప ఆలయం వరకు మురుగుకాలువల్లో పూడికతీతకు ఒకే కాలువకు నాలుగు రోడ్ల కాలువల్లో పూడిక తీసినట్లు రూ.7.40 లక్షులు నిధులు డ్రా చేశారని ఆరోపించారు. దీంతో పాటు జేసీబిలకు లక్ష రూపాయలు ఖర్చ చేసినట్లు చూపించడం విశేషమన్నారు. ఈ ఏడాది ఏఫ్రిల్ 26న రూ.8 లక్షలు సెల్ఫ్ చెక్, జూన్ 6న రూ.6.50 సెల్ఫ్ చెక్ పేరుతో నిధులు డ్రా చేశారని తెలిపారు. ఇవేకాకుండా మరో రూ.8 లక్షలు డ్రా చేసి స్వప్రయోజనాలకు వాడుకున్నారని పేర్కొన్నారు. దీనిపై గత కౌన్సిల్ సమావేశంలో నిలదీయగా పొంతన లేని సమాధానం చెప్పడంతో సమావేశాన్ని బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మంత్రి చొరవతో నిధులు మంజూరై ఆరు నెలలు కావస్తున్న వాటికి టెండర్లు పిలువకుండా జాప్యం చేయడం వెనుక ఏమిదాగి ఉందో ఆమె చెప్పాలన్నారు. జనరల్ ఫండ్ నిధులు పక్కదారి పట్టించడాన్ని విలేఖర్ల సమావేశంలో చెప్పగా ఆమె మరుసటిరోజు వాటికి సమాధానం చెప్పకుండా దళిత మహిళని చిన్నచూపు చూస్తున్నారని కుల రాజకీయాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాగైతే పార్టీకి చెడ్డపేరు రావడంతో ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ఏ పార్టీ వారైన సమానమేమని దీనిని ఆమె తెలుసుకోవాలన్నారు. ఇవే కాకుండా అనేక అవకతవకలు మున్సిపాలిటిలో జరిగాయని అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. అప్పుడు ప్రజలే పాలకవర్గాన్ని నిలదీసే రోజులు వస్తాయన్నారు.

చవితి వేడుకలకు కొలువుదీరిన గణనాథులు
వెంకటగిరి, సెప్టెంబర్ 3: వినాయకచవితి వేడుకలకు పట్టణంలోని పలుచోట్ల గణనాథుడి విగ్రహాలు తయారుచేసి అమ్మకాలకు సిద్ధం చేశారు. గ్రామాల్లోని యువత ఈ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. రెండు అడుగుల నుంచి 15 అడుగుల వరకు వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు భక్తులను ఆకట్టుకునే విధంగా రాజస్తాన్‌కు చెందిన తయారీదారులు సిద్ధం చేశారు. గత సంవత్సరంకన్నా ఈ ఏడాది విగ్రహాలు తయారుచేసే వస్తువుల రేట్లు అధికంగా పెరిగాయని దానికి తగ్గట్టుగా విగ్రహాలు ధరలు మాత్రం పెంచితే భక్తులు కొనడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చవితి ఉత్సవాలకు పట్టణంలోని పలు వినాయక ఆలయాలు గత వారం రోజులుగా ముస్తాబు చేస్తున్నారు.