శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

డబుల్ డిజిట్ గ్రోత్ 15 శాతం ఉండేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 9: డబుల్ డిజిట్ గ్రోత్ 15 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఠక్కర్ కలెక్టర్లను కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్, ఎస్‌ఇజెడ్ భూములు, ఎపిఐఐసి వారికి త్వరితగతిన అప్పగించాలని కలెక్టర్లను కోరారు. జాతీయ రహదారులు, రైల్వేలకు కావల్సిన భూములను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బడి పిల్లల ఆధార్ నమోదు వంద శాతం పూర్తిచేయాలన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరు కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టరు ఆర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టరు-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.