శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కమనీయం సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఏప్రిల్ 15: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలోని దర్గామిట్ట శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో నగరంలోని పలు రామాలయాలు తెల్లవారు జామున నుంచే శ్రీరామనామ జపంతో మారుమోగాయి. సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసేందుకు భక్తులు భారీగా వేదిక వద్దకు చేరుకున్నారు. శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలను జిల్లా జడ్జి కనకదుర్గారావు దంపతులు, పట్టు వస్త్రాలను కలెక్టర్ జానకి దంపతులు సమర్పించారు. నవమి రోజున శ్రీరాముడి జననం, అదే రోజు సీతారాముల కల్యాణం కూడా జరగడంతో ఎంతో అదృష్టంగా భక్తులు భావిస్తారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు తరలివచ్చిన భక్తులకు చల్లదనం కోసం చలువ పందిళ్లు, విసనకర్రల పంపిణీతో పాటు భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా అందచేశారు. అనంతరం భక్తులకు తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.