శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సంక్షేమ పథకాలు అమలుపర్చిన అధికారులకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 18: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరచిన సివిల్ సర్వీస్ అధికారులకు అవార్డులు అందజేయనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ జాయింట్ సెక్రటరీ స్మిత అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుండి మంగళవారం ఆమె జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2015-16 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇ-గవర్నెస్‌పై ప్రధానమంత్రి అవార్డులు అందజేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులు అందజేయనున్నామన్నారు. ఈ అవార్డులు గతేడాది ఏప్రిల్ నుండి 2016 డిసెంబర్ వరకు చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరుతెన్నుల ప్రాతిపదికగా అవార్డులను అందజేస్తామన్నారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి సించాయి యోజన, దీనదయాళ్ ఉఫాధ్యాయ గ్రామజ్యోతి యోజన, పిఎం ఫసల్ భీమా యోజన, స్టాండప్, స్టార్టప్ ఇండియా పథకాల అమలుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జెసి-2 సాల్మన్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ పథకాల అమలును క్షేత్రస్థాయి అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అవార్డుల కోసం నిర్ణీత ప్రొపార్మాలను వచ్చే ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఎన్‌ఐసి అధికారి సాయి మాట్లాడుతూ ప్రగతిని నిర్ణీత ప్రొఫార్మాలతో పాటు అందుకు సంబంధించిన చాయాచిత్రాలను, వీడియో క్లిప్పింగ్‌లను తమ రిపోర్టులో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్టీఎ కార్యాలయంలో వాహనాల వేలం
వేదాయపాళెం, అక్టోబర్ 18 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ రవాణాశాఖ అధికారులకు పట్టుబడిన వాహనాలను మంగళవారం స్థానిక రవాణాశాఖ కార్యాలయంలో వేలంపాటలు నిర్వహించారు. రవాణాశాఖ డిప్యూటి కమిషనర్ ఎన్.శివరామ్‌ప్రసాద్ సమక్షంలో ఆర్టీ ఏ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈ వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటలో 90 వాహనాలు ద్విచక్రవాహనాలు, ఆటోరిక్షాలు, లారీ, గూడ్స్ వెహికల్స్‌ను ఉంచారు. వేలం పాటల ద్వారా వాహనాలను దక్కించుకునేందుకుగాను జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరికి వారు తమకు నచ్చిన వాహనాలను వేలంలో పాడుకున్నారు. అధికారులు నిర్వహించిన ఈ వేలంపాటల ద్వారా రవాణాశాఖ ఖజానాకు రూ.10,14,500లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో కిషోర్, ఎంవిఐలు ఆదినారాయణ, సీతారామిరెడ్డితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.