శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తలసరి ఆదాయంతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, ఏప్రిల్ 14: రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తలసరి ఆదాయంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ అన్నారు. గురువారం ముసునూరువారిపాళెం గ్రామంలో ఎన్టీఆర్ గృహకల్ప నిర్మాణ పథకం ద్వారా 72 కుంటుంబాలకు సంబంధించి పక్కా గృహాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఏపి జెన్‌కో సిఎస్‌ఆర్ నిధులతో పూర్తయిన వివిధ పనులను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈసభకు ఎఎంసి చైర్మన్ మునుకూరు రవికుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి రాజధానికి 24వేల మంది ఉద్యోగులను తీసుకువస్తామన్నారు. 24వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిన ఘనత నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఆయన కొనియాడారు. రాష్ట్భ్రావృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సొంత గృహం కలిగి ఉండాలనే సంకల్పంతో పక్కా గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిల్లో రాష్ట్భ్రావృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్నారు. దళితులకు పెద్దపీట వేసిన ఘనత టిడిపికే దక్కుతుందని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా గృహాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ముత్తుకూరు మండలంలో ఐదుకోట్ల రూపాయల వ్యయంతో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 1250 పక్కా గృహాలు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. టిడిపి ప్రభుత్వంలో రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని ఈసందర్భంగా అన్నారు. అనంతరం ఎఎంసి చైర్మన్ మనుకూరు రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముసునూరువారిపాళెం గ్రామంలో జూనియర్ కళాశాల, ఆసుపత్రి నిర్మించాలని మంత్రి నారాయణకు విన్నవించారు. ఈవిషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు వేదికపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పై కార్యక్రమాలను ఎమ్మెల్సీ సోమిరెడ్డితో కలసి ప్రాంరభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, హౌసింగ్ ఎండి రామచంద్రారెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ చెన్నయ్య, జెన్‌కో అధికారులు సి సత్యనారాయణ, టిడిపి నాయకులు దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, వేకొల్లు కోదండరామయ్య, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైభవంగా పార్వతీపరమేశ్వరుల కల్యాణం
మనుబోలు, ఏప్రిల్ 14: కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం బద్దెవోలు క్రాస్‌రోడ్డు సమీపంలోని సంగమేశ్వర దేవస్దానం వద్ద పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కన్నులపండువగా జరిగింది. బుధవారం రాత్రి శివపార్వతులను పూలాలంకణ చేసి రథంలో వుంచి స్థానిక తూర్పువీధిలోని శివాలయం నుండి రథాన్ని గ్రామస్థులు భుజాలపై మోసుకుని సంగమేశ్వర దేవస్థానం వద్దకు చేర్చారు. అనంతరం గురువారం ఉదయం ఆలయ అర్చకులు మనోజ్‌శర్మ, సాయిశర్మ వేదమంత్రోచ్ఛరణల మధ్య పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపారు. సాయంత్రం పార్వతీపరమేశ్వరుల చక్రస్నానానికి తీసుకువెళ్లారు. రాత్రికి రథాన్ని తిరిగి సంగమేశ్వర దేవస్థానం నుంచి స్థానిక శివాలయానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పోశంరెడ్డి మల్లికార్జునరెడ్డి, రాధిక దంపతులు వ్యవహరించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా 3 జంటలకు వివాహం నిర్వహించారు. మనుబోలు యూత్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎండవేడిమి వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా పచ్చిపాల క్రిష్ణారెడ్డి, నల్లిబోయిన నరేంద్ర సుమారు 3వేల మజ్జిగ ప్యాకెట్లు అందించారు. స్థానికంగా యువత భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందించారు. ఈకార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పచ్చిపాల జయరామిరెడ్డి, దండు చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. సుమారు 10వేల మంది భక్తులు కల్యాణాన్ని తిలకించారు. దేవస్థానం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ గంగాధర్ తన సిబ్బందితో పర్యవేక్షించారు.
భుజాలపై రథం మోయడం ప్రత్యేకత
సుమారు 35 అడుగుల రథాన్ని యువకులు సుమారు 5 కిలోమీటర్లు పైన భుజాలపై పెట్టుకుని తీసుకురావడం ప్రత్యేకత. ఎక్కడైనా రథాన్ని లాగడం మాత్రమే చేస్తుండగా అనాదిగా తూర్పు వీధిలో ఉన్న శివాలయం నుండి బద్దెవోలు రోడ్డు సమీపంలో వున్న కామాక్షితాయి సంగమేశ్వర దేవాలయానికి రోడ్డు మార్గం లేకపోవడంతో రథాన్ని భుజాలపై మోస్తారు. అదే విధానాన్ని ప్రస్తుతం గ్రామస్థులు ఆమలు చేయడం పరిపాటి. ఈ రథాన్ని తీసుకువస్తున్న సమయంలో వేలాదిగా ప్రజలు రథం వెంబడి వస్తారు. మార్గమధ్యంలో చెన్నకేశవ దేవాలయం వద్ద భక్తులు టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శివాలయం వద్దకు రథాన్ని చేర్చారు.

ఆటో దొంగలు అరెస్టు
9 ఆటోలు స్వాధీనం
కోట, ఏప్రిల్ 14: అనేక జిల్లాల్లో పలు ఆటోలను చోరీ చేసిన దొంగలను ఆరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఆటోలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో గూడూరు డిఎస్పీ బి శ్రీనివాస్ విలేఖర్లతో మాట్లాడుతూ గూడూరులోని గాంధీనగర్‌కు చెందిన కొండల ఆదినారాయణ తిరుపతిలోని జీవకోనకు చెందిన పసుపులేటి నాగరాజు అలియాజ్ చిచ్చాతో కలసి కోట, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు 1వ నగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక్కొక్క ఆటోను, నెల్లూరు 5వ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో 5 ఆటోలను చోరీ చేశారన్నారు. కోటలో జరిగిన ఆటో చోరీపై వాకాడు సిఐ అక్కేశ్వరరావు తన సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉంచగా ఆదినారాయణ చోరీ చేసిన తొమ్మిది ఆటోలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా కోట క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం అతనిని పట్టుకున్నట్లు తెలిపారు. ఆదినారాయణను విచారించగా తాము చోరీ చేసిన ఆటోలను చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పెన్నా రమణమూర్తి, మొగల్ బావజాస్, షేక్ షాకిర్‌లతో ఒప్పందం కుదుర్చుకొని వారికి ఆటోకి 5 వేల రూపాయల వంతున చెల్లించి ఆటో ఇంజన్, చాసిస్, రిజిస్ట్రేషన్ నెంబర్లను మార్చివేస్తామని చెప్పడంతో వారిని కూడా అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. అయితే నాగరాజు పరారీలో వున్నాడని తెలిపారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. అంతర్ జిల్లాల ఆటో దొంగలను పట్టుకున్న సిఐ అక్కేశ్వరరావు, స్థానిక ఎస్సై అజయ్‌కుమార్, ఎఎస్సై లింకన్, ఐడిపార్టీ హెడ్‌కానిస్టేబుళ్లు ఆర్‌విరాజు, సుబ్బారావు, సిబ్బంది దయాకర్, కస్తూరయ్య, నాగేంద్ర, కె వెంకటేశ్వర్లు, వి వెంకటేశ్వర్లు, రాజన్నలను డిఎస్పీ అభినందించారు. అలాగే వారికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫారస్సు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్సై అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

దళితుల పట్ల చంద్రబాబు చిన్నచూపు
మందా కృష్ణమాదిగ ధ్వజం
పొదలకూరు, ఏప్రిల్ 14: దళితుల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన గురువారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఓవైపున దళితులను అవమానిస్తూ మరోపక్క రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామంటూ జయంతి వేడుకలను చేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబుకు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో తొలుత ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి చంద్రబాబు మోసగిస్తున్నాడని దుయ్యబట్టారు. మండల ఎమ్మార్పీఎస్, ఎంఇఎఫ్, విహెచ్‌పిఎస్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెంచలయ్య మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి ఎం వేణుమాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు శేషం పుల్లయ్య మాదిగ, విహెచ్‌పిఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి షేక్ చాంద్‌బాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ గృహాలకు శంకుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ జిల్లాలో ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించనున్న గృహాలకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ 447.40 కోట్ల అంచనాలతో 10,040 గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జి ప్లస్ పద్ధతిన 4,800 గృహాలను రూ 264 కోట్ల వ్యయంతోనూ, లబ్ధిదారులకు చెందిన 5,240 గృహాలను రూ.183.40 కోట్ల అంచనాలతో రూపొందించినట్లు తెలియచేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.జానకి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

పడకండ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
* ఆత్మకూరు డిఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడి
ఆత్మకూరు, ఏప్రిల్ 14: ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆ గ్రామాన్ని స్థానిక ఎస్సై పూర్ణచంద్రరావు లాంఛనంగా దత్తత తీసుకనే కార్యక్రమానికి డిఎస్పీతోపాటు సిఐ ఖాజావలి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వెళ్లే రోడ్లకు ఇరువైపులా ఉండే చెట్ల తొలగింపు చేపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికార్లతో మాట్లాడి నీటి సమస్యకు పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదువుకునే విద్యార్థులకు అవసరమైన పుస్తక సంపద అందజేస్తామన్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. మా ఊరు- మా పోలీస్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో తరచూ ఎస్సై నిద్రిస్తారన్నారు. గ్రామంలో తమ స్థాయికి మించి పరిష్కారానికి నోచని సమస్యలను ఎస్పీ ద్వారా కలెక్టర్‌తో చర్చించి కొలిక్కి తీసుకొస్తామన్నారు. ఆర్టీసీ అధికార్లతో చర్చించి గ్రామంలోకి బస్సు పునరుద్దరణ విషయమై అప్పటికప్పుడే విచారణ చేపట్టారు. విద్యుత్ ఏఇతో కూడా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌తో వచ్చే నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పిఎస్సై ఆంజనేయులు కూడా పాల్గొన్నారు.