రాష్ట్రీయం

48 గంటల్లో జవాబివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కోడ్ ఉల్లంఘనపై కెసిఆర్, కెటిఆర్‌కు ఇసి షోకాజ్ నోటీసులు

హైదరాబాద్, డిసెంబర్ 10: స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు,ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుకు వేర్వేరుగా షోకాజు నోటీసులు జారీ చేసింది. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తమపై చర్యలు ఎందుకు తీసుకోరాదో 48 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో (క్యాంపు కార్యాలయం) నవంబర్ 28వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో ఖమ్మం జిల్లాను గోదావరి జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారని ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల వల్ల ఖమ్మం జిల్లాకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎన్నికల సంఘం పేర్కొంది. కేంద్రంలోగానీ, రాష్ట్రంలోగానీ అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని ఎన్నికల కోడ్ ఉందని పేర్కొంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌లను కోడ్ అమలులో ఉన్న సమయంలో ఉపయోగించకూడదని నిబంధన ఉందని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంపై ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని తన నోటీసులతో పాటు ఎన్నికల సంఘం జత చేసింది.
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుకు జారీ చేసిన షోకాజు నోటీసుల్లో సచివాలయంలో మంత్రి తన ఛాంబర్‌లో ఇతర పార్టీల నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా పార్టీ కండువాలు కప్పారన్న అభియోగంపై వివరణ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 28వ తేదీన సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పడంపై ఒక పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎన్నికల సంఘం తన నోటీసులతో పాటు జత చేసింది. కోడ్ అమలులో ఉండగా ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పడం ఉల్లంఘననే అవుతుందని, దీనిపై 48 గంటలోగా వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రికి జారీ చేసిన నోటీసుల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం నిబంధనలు, నియమావళిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మంత్రి కె తారకరామారావు ఉద్దేశ్యపూర్వకంగానే ఉల్లంఘించినట్లుగా భావించాల్సి ఉందని నోటీసులో ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా అధికారిక కార్యాలయాలు, ఆవరణల్లో ఎటువంటి అధికారిక సమావేశాలు నిర్వహించరాదని, హామీలు ఇవ్వరాదని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలియచేయాలని పేర్కొంది. 48 గంటల్లోగా నోటీసులు సమాధానం ఇవ్వని పక్షంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు, మంత్రి కె తారకరామారావుకు షోకాజ్‌నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.