తెలంగాణ

మంత్రి రావెల కుమారుడిపై నిర్భయ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ వివాహిత మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు ఎపి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టంలోని సెక్షన్ 345 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం పోలీసులు నిందితుడికి నోటీసులు జారీ చేశారు. తాను రోడ్డుపై నడిచి వెళుతుండగా చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు సుశీల్ ప్రయత్నించినట్లు ఓ వివాహిత పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. సంఘటన జరిగినపుడు ఆమె కేకలు వేయడంతో స్థానికులు సుశీల్‌తో పాటు అతని కారు డ్రైవర్ అప్పారావుకు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే.