బిజినెస్

విస్తరణ బాటలో మధురపూడి విమానాశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయాన్ని పర్యాటకానికి ఆలంబనగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ స్నేహపూర్వక విధానాలతో ఈ విమానాశ్రయాన్ని విస్తరించనుండటంతో దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఎకో ఎయిర్ పోర్టు అని పిలవచ్చు. 200 కోట్ల రూపాయల నిధులతో మొత్తం 1,223 ఎకరాల్లో విమానాశ్రయ విస్తరణ పనులు జరుగుతున్నాయి.
ఒకేసారి ఆరు విమానాలు పార్కింగ్ చేయడానికి వీలుగా అవసరమైన అన్ని ప్రమాణాల ప్రకారం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక విధానాలతో ఈ పనులు జరుగుతున్నాయి. 2018 నాటికల్లా పెద్ద విమానాలు పార్కింగ్ చేయగలిగే విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ విమానాశ్రయం విస్తరణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రెండు ఎటిఆర్ విమానాలు, ఒక క్యూ 400 విమానం వెరసి మూడు విమానాలు నిలిచే విధంగానే 1.75 కిలోమీటర్ల మేరకే రన్‌వే గానీ, విమానాల పార్కింగ్‌గానీ ఉంది. దీంతో ఒకేసారి ఆరు పెద్ద విమానాలు వచ్చిపోయేలా విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 350 కోట్ల రూపాయలతో మొత్తం 857 ఎకరాల భూమిని సేకరించి రన్‌వే నిర్మిస్తున్నారు. గ్రేడింగ్ పిల్లర్లు, ఇంజక్షన్ వెల్స్‌తో మొత్తం 3.16 కిలోమీటర్ల మేర రన్‌వేను విస్తరిస్తున్నారు. పాసింజర్ విమానాలతో పాటు కార్గో కూడా రవాణా జరిగేవిధంగా బెల్లీ కార్గోకు అనుగుణంగా విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. నాలుగు పార్కింగ్ ప్లేస్‌ల నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు 2018 నాటికి పూర్తిచేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించామని మధురపూడి విమానాశ్రయం డైరెక్టర్ ఎం రాజ్‌కిషోర్ చెప్పారు. మధురపూడి విమానాశ్రయం పర్యాటక ప్రధానంగా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని సహజసిద్ధ అందాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును కూడా ఈ విమానాశ్రయం కేంద్రంగా చేపట్టింది.
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మడ అడవులు, పాపికొండలు, రాజమహేంద్రవరం అతి ప్రాచీన నగరం, కోనసీమ అందాలు, రంపచోడవరం అడవులు, దిండి రిసార్ట్సు, యానాం, అంతర్వేది నదీ సంగమ ప్రాంతాలు ఇలా ఎన్నో విశేషాలతో ఈ విమానాశ్రయం ముడిపడి ఉంది. కాగా, ఎకో విమానాశ్రయంగా అభివృద్ధి చేయడంవల్ల ప్రాంగణంలో ఆక్సిజన్ చెట్లను నాటారు. వర్షపు నీరు భూమిలో ఇంకిపోయేలా ఇంజక్షన్ వెల్స్ నిర్మించారు. భూగర్భ జలాలు పెరిగేలా విమానాశ్రయం అభివృద్ధిలో అంతర్లీనంగా ప్రణాళిక రూపొందించడంతో దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా చెత్తా చెదారాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రాంతంలో పండే తాజా కూరగాయలు, పండ్లు, కడియం ఫ్లోరీ కల్చర్, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, కొబ్బరి ఉప ఉత్పత్తులకు వీలుగా కార్గోను విస్తరిస్తున్నారు. స్థానిక పరిశ్రమలకు అత్యవసరంగా అవసరమయ్యే మిషనరీ విడి పరికరాలు సుదూర ప్రాంతం నుంచి గంటల వ్యవధిలోనే అందించే విధంగా కొరియర్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. అత్యవసర మిషనరీని దిగుమతి చేసుకునే విధంగా కార్గో రవాణా ప్రత్యేక విమానాలకు అవసరమైన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఈ విమానాశ్రయం కేంద్రంగా ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కలిగింది. కోస్టల్ కారిడార్, సాగరమాలలో పోర్టుల విస్తరణ, జిఎంఆర్, జిఎస్‌పిసి, ఒఎన్‌జిసి, గెయిల్ తదితర సంస్థల కార్యకలాపాలు కూడా బాగా విస్తరించేందుకు ఈ విమానాశ్రయం దోహదపడుతోంది. మొత్తం మీద అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విమానాల రాకపోకలకు అనుగుణంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి జరుగుతోంది.