కరీంనగర్

ఎన్‌టిపిసికి సమ్మె నోటీస్ జారీ చేసిన తెలంగాణ కార్మిక సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 20: ఎన్‌టిపిసి ఉద్యోగుల డిమండ్లను 15రోజులులోగా పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెలోకి వెళతామని ఎన్‌టిపిసి తెలంగాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీపతి రావు అన్నారు. శుక్రవారం ఎన్‌టిపిసిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్‌టిపిసి తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీపతి రావులు మాట్లాడుతూ ఎన్‌టిపిసి యాజమాన్యం ఉద్యోగుల ఉత్పాదక బోనస్ రద్దును ఎత్తివేయాలని అదే విధంగా మరో 7డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీస్‌ను ఎన్‌టిపిసి ఇడితో పాటు కార్మిక శాఖ అధికారులకు శుక్రవారం అందజేశామని అన్నారు. గత కొనే్నళ్లుగా కార్మికులకు అమలు జరుగుతున్న ఉత్పాదక బోనస్‌ను ఎన్‌టిపిసి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రద్దు చేసిందని అన్నారు. రద్దును ఉప సంహరించుకొని కార్మికులకు ఎప్పటిలాగానే ఉత్పాదక బోనస్‌ను చెల్లించాలని అన్నారు. అదే విధంగా టౌన్‌షిప్ పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారాయని వాటిని మరమ్మతు చేయాలని అనేకసార్లు యాజమాన్యానికి వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. రిక్రియేషన్ క్లబ్ ద్వారా డిటిహెచ్ సౌకర్యాన్ని కల్పించాలని, కొత్తగా ఎంపికైన 27మంది భూ నిర్వాసితులకు పెట్రోల్ అలవెన్స్‌తో పాటు కారు అలవెన్సులను అమలు చేయాలని, పంచ్ ఎంట్రీపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తదితర డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ను అందించామని అన్నారు. 15రోజుల్లోగా సమ్మె డిమాండ్లపై చర్చించి పరిష్కరించకుంటే తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మెలోకి వెలతామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో శ్రీనివాస్ రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.