మహబూబ్‌నగర్

చట్టాలను గౌరవించి నడుచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జనవరి 23: ప్రజాహితం కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్టవ్రైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు.సోమవారం జడ్చర్లలోని చంధ్రా గార్డెన్స్‌లోపోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఎర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథి గా హజరయ్యారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చట్టాలపై అవగాహన లేకపోవడంవల్లే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండి జాగ్రత్తగా వాహానాలను నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరగవని ఆయన తెలిపారు. మనకు సంబందం లేకుండా,మన ప్రమేయం లేకుండా జరిగేవే ప్రమాదాలు..కాని కొద్దిపాటి అజాగ్రత్త,నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.రోగాల బారిన పడి మరణిస్తున్న వారి కంటే ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని ఆయన అన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన భాధ్యత సంబందిత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటింబీకులు తీవ్ర మనోవేధనకు గురి అవుతుంటారని, అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు ద్వారా ఇప్పటికే పోలీసు శాఖ 30శాతం రోడ్డు ప్రమాదాలు నివారించిందని తెలిపారు. ఈ కేసుల నమోదు ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుందని, అందువల్ల వాహాన చోదకులు డ్రంక్ అండ్ డ్రైవ్ కు దూరంగా ఉండి రోడ్డుప్రమాదాల నివారణకు తోడ్పాటునందించాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ దేశంలోనే మహాబూబ్‌నగర్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తయారు చేయాలనే ఉద్ధేశ్యంతో తమ శాఖ ముమ్మరంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకోసం రవాణా శాఖ సహకారంతో రహాదారి నా నేస్తం కార్యక్రమాన్ని,డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అంతేకాక మానవతా దృక్పదంతో ఫ్రేండ్లీ పోలిసింగ్ ద్వారా వాహాన చోదకులకు మంచి మాటలతో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మహాబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా తాను భాద్యతలు చేపట్టిన సమయంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరగుతుండేవని పలు చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేయడం జరగిందని ఆమె వెల్లడించారు. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో జాతీయ రహాదారిపై 33 ప్రమాదకర బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయని అందువల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఘణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఏడు నెలల వ్యవధిలో పలు చర్యలు చేపట్టి ప్రమాదాల తీవ్రత తగ్గించామని ఆమె వివరించారు. అనంతరం తమ జీవిత కాలంలో ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు చేయని పలువురు డ్రైవర్లకు మంత్రి లక్ష్మారెడ్డి,ఎస్పీ రెమా రాజేశ్వరి సన్మానం చేసి వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో డిప్యూటి ట్రాన్స్‌పోర్టు కమీషనర్ మమతా ప్రసాద్, డిఎస్పీ భాస్కర్, లక్ష్మి, శోభ, శివకుమార్, గంగాధర్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.