ఓ చిన్నమాట!

తాత్సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా మంది మిత్రులు స్మార్ట్ ఫోన్‌తో, కంప్యూటర్ కీ బోర్డుతో టైప్ చేస్తుంటారు. నేను ఇంకా దానికి అలవాటు కాలేదు. పెన్నుతో రాయటంలోనే ఉన్నాను.
టేబుల్ ముందు కూర్చోగానే తెల్ల కాగితాలు నా వైపు చూస్తూ వుంటాయి, ఏమైనా రాయమన్నట్టు. ఏమీ రాయనప్పుడు వెక్కిరిస్తున్నట్టు కూడా అన్పిస్తుంది.
అలా అన్పించడానికి కారణం కూడా ఉంది. వారానికి మూడు రచనలు చేస్తున్నా రాద్దామని అనుకున్న రచనలు చాలా మిగిలిపోయి ఉన్నాయి.
ఓ యాభై దాకా కథలు, ఓ మూడు నవలలకి ప్లాన్ చేసి అలాగే వదిలేశాను. అందుకే నా ముందు వున్న తెల్ల కాగితాలు కొన్నిసార్లు నా వైపు చూస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, వెక్కిరిస్తున్నట్టు అన్పిస్తుంది.
ఈ కథలూ, నవలలు రాయకపోవడానికి కారణం ఆలోచనలు రాక కాదు. ఏదో ఒక కారణంతో వాటిని పోస్ట్‌పోన్ చేయడం. రాయాలని నిర్ణయం తీసుకోక పోవడం.
ఓ నవలని ఓ ముప్పై పేజీలు రాసి వదిలేశాను. కొన్ని కథలు సగం రాసి అలాగే వదిలేశాను.
ఈ తెల్ల కాగితాలు నా వైపు చూసి నవ్వినట్టు వెక్కిరించినట్టు అన్పించకుండా వుండాలంటే నేను నా ప్రణాళికను అమలుచేయాలి.
ఆలోచనలని పదాలుగా, పదాలని వాక్యాలుగా ప్రవహింపచేయాలి. అప్పుడు ఈ కాగితాలు నన్ను ఆహ్వానిస్తాయి.
మనం కచ్చితంగా రాయాలని అనుకొంటే ఏదీ మనల్ని ఆపలేవు. ఏవైతే మన రాతకు ఆటంకంగా భావిస్తున్నామో అవి ఆటంకంగా అన్పించవు.
నిజానికి ఈ తెల్ల కాగితాలు కాదు నన్ను చూసి నవ్వుతున్నవి
వెక్కిరిస్తున్నవి, నన్ను ఓ శత్రువులా చూస్తున్నవి
నన్ను అలా చూస్తున్నది నా మనస్సు. ఈ నాన్చడం, తాత్సారం చేయడం, నిర్ణయం తీసుకోక పోవడం అనేవి మన శత్రువులు. వీటిని జయిస్తే మనం అనుకున్నది సాధిస్తాం. ఆ వైపు మన ప్రయాణం కొనసాగిస్తాం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001