ఓ చిన్నమాట!

ప్రతిభ (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ తరుచూ ఒక మాట చెబుతుంటారు.
ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇతరులెవ్వరిలో లేని ప్రత్యేక గుణాలు ప్రతి వ్యక్తికి ఉంటాయని, ఎన్నో వీర్య కణాల్లో పోటీ పడి అండాన్ని చేరిన వీర్య కణమే మనిషని, అందుకని ప్రతి వ్యక్తీ ప్రత్యేకమని చెబుతుంటారు.
అంతేకాదు ప్రతి వ్యక్తీ మామూలు వ్యక్తి కాదని అతనిలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయని కూడా చెబుతుంటారు.
ప్రతి వ్యక్తిలో కొన్ని టాలెంట్స్ ఉన్నాయని కూడా చెబుతుంటారు.
ఇవి నిజమని నమ్మిన వ్యక్తులు జీవితంలో ముందడుగు వేసి ప్రయాణం చేస్తూంటారు. అలా నమ్మని వ్యక్తులు నిరుత్సాహంతో జీవితంలో ఎలాంటి పురోగతి లేకుండా బతుకుతుంటారు.
నిజంగానే ప్రతి వ్యక్తిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు, ప్రతిభ దాక్కొని ఉన్నాయా?
ఉన్నాయని పెద్దవాళ్లు చెబుతున్నారు. తమలో దాగి వున్న ప్రతిభను వాళ్లు గుర్తించి పదును పెడితే వాళ్లు మామూలు మనిషిగా, సగటు మనిషిగా వుండరు. ప్రతిభావంతులుగా చలామణి అవుతారు. ఆ విధంగా గుర్తించని వ్యక్తులు, తమ ప్రతిభకు పదును పెట్టని వ్యక్తులు సగటు మనుషులుగా మిగిలిపోతారు.
నేను మామూలు వ్యక్తిని, నాలో ఏ ప్రతిభ లేదని అనుకున్న వ్యక్తులు అలాగే వుండిపోతారు.
కొంత మంది ప్రతిభను ఇతరులు గుర్తించి ప్రోత్సహిస్తారు. మరి కొంతమంది వారి ప్రతిభను వారే గుర్తించి పైకి ఎగబాకుతారు.
మరి కొంత ప్రతిభ తమ ప్రతిభని పెద్దగా అయిన తరువాత గుర్తించి, పైకి రావడానికి ప్రయత్నిస్తారు.
ప్రతిభకి-
చదువుతో సంబంధం లేదు.
వయస్సుతో సంబంధం లేదు.
ఇతరులతో సంబంధం లేదు.
పూర్తిగా సంబంధం లేదని అనలేం. కానీ ఇవేవీ లేకున్నా పైకి వెళ్లవచ్చు. జీవితంలో పురోగతిని సాధించవచ్చు.
సగటు మనిషిగా ఉందామా ఎంతో కొంత అందంగా, ఆకర్షణీయంగా, విలువగా ఉందామా?
నిర్ణయం మనదే!

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001