ఓ చిన్నమాట!

రెండు చెవులు, ఒక నోరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టుల్లో న్యాయమూర్తులు చాలా తక్కువగా మాట్లాడుతారు. కొంతమంది న్యాయమూర్తులు అసలే మాట్లాడరు. మాట్లాడకూడదన్న నియమం ఏమీ లేదు గానీ న్యాయమూర్తులు మాట్లాడటం వల్ల, వాళ్లు వేసే ప్రశ్నల వల్ల పార్టీల్లో అనవసర అపోహలు ఏర్పడుతాయి.
కొన్ని సందర్భాలలో సందేహ నివృత్తి చేసుకోవడం కోసం కొన్ని ప్రశ్నలని వేయాల్సి వుంటుంది. అయితే ఆ ప్రశ్నల వల్ల పార్టీలు అపార్థం చేసుకున్న సందర్భాలు ఎన్నో. అందుకని న్యాయమూర్తులు వినడానికే ఇష్టపడతారు. తమ ఉత్తర్వుల ద్వారా తీర్పుల ద్వారా మాట్లాడుతారు.
చాలామంది మాట్లాడటం కళ అనుకుంటారు. అది నిజమే. అదే విధంగా వినడం కూడా కళే.
కొన్నిసార్లు-
మాటలు వింటాం.
కానీ
అందులోని భావాన్ని సరిగ్గా గ్రహించం.
ఎదుటి వ్యక్తి చెప్పే విషయం తమకు తెలిసిందేనని కొంతమంది వినడం ప్రారంభిస్తారు. అప్పుడు అపోహలు కలిగే అవకాశం, సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
దానివల్ల అనవసర నిర్ణయానికి చాలామంది వస్తుంటారు.
న్యాయమూర్తుల విషయం వేరు. వారి ముందు రికార్డు ఉంటుంది. దాన్ని చదివి నిర్ణయానికి రావాల్సి వుంటుంది. కాబట్టి అక్కడ తప్పు దొర్లే అవకాశం తక్కువ.
మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. అప్పుడు తప్పుడు అభిప్రాయాలకి వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి.
ఇక్కడొక విషయం మనం గుర్తుంచుకోవాలి.
ఈ సృష్టి, దేవుడు మనకు రెండు చెవులు, ఒక నోరు ఇచ్చాడు.
దాని ఉద్దేశం వినడం జాగ్రత్తగా వినాలి. అదే విధంగా తక్కువగా మాట్లాడాలి.
జాగ్రత్తగా విని, తక్కువగా మాట్లాడితే ఇతరులతో మన సంబంధాలు మెరుగ్గా వుంటాయి.
స్నేహితాలు బలపడుతాయి.
న్యాయమూర్తులకన్నా ఎక్కువ ఇది మనందరికి అవసరం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001