ఓ చిన్నమాట!

పిచ్చుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇల్లు విశాలంగా ఉండేది. పెద్దింటికి వంటింటికి మధ్య ఎండాకాలం పడుకోవడానికి విశాలమైన స్థలం వుండేది. ఇంటి ముందు కచేరీ ఉండేది. పెద్దింటికి వంటింటికి మధ్య వున్న స్థలం కూడా కచేరీ మాదిరిగా ఓపెన్‌గా ఉండేది. గ్రిల్ వుండేది కాదు. అందుకని పిచ్చుకలు హాయిగా ఇంట్లోకి వచ్చేవి. గదుల్లో వ్రేలాడదీసిన ఫొటోల వెనుక తమ గూళ్లను పెట్టుకొనేవి.
మా హాల్లో వున్న రెండు స్తంభాలకి రెండు పెద్ద అద్దాలు వుండేవి. వాటిని పిచ్చుకలు బాగా ఉపయోగించుకునేవి. ఆ అద్దాల్లో తమ ప్రతిబింబాలని చూస్తూ వేరే ఎవరో అక్కడ వున్నారనుకొని తమ ముక్కులతో పొడుస్తూ కాలక్షేపం చేసేవి. మేం ఎవరన్నా అటువైపు రాగానే అక్కడి నుంచి పరుగెత్తుకెళ్లేవి. వాటి అజ్ఞానం చూసి మేం నవ్వుకునేవాళ్లం.
చాలా రోజుల తరువాత ఒక విషయం అర్థమైంది. ఆ పిచ్చుకలకన్నా మనం ఏమైనా విభిన్నంగా వున్నామా?
మనల్ని మనం హింసించుకోవడం లేదా?
మన ప్రయత్నాలని మనం నిలుపుదల చేయడం లేదా?
మన పట్ల మనం ప్రేమపూర్వకంగా ఉంటున్నామా?
లేదే!
మనకీ ఆ పిట్టలకీ ఏమైనా భేదం వుందా?
బాగా తెలివిగల వాళ్లమని అనుకునే మనం ఆ పిచ్చుకల మాదిరిగా ప్రవర్తిస్తున్నామా? లేదా?
మనం మన ప్రతిబింబాన్ని అద్దంలో చూసినప్పుడు మన పట్ల మనం కొంత ప్రేమపూర్వకంగా వుండాలి.
మనల్ని మనం ఉత్తేజపరచుకోవాలి.
మనకి అవసరమైన మార్పులని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి.
అలా చేయనప్పుడు ఆ పిచ్చుకల మాదిరిగానే మనం మారిపోతాం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001