ఓ చిన్నమాట!

వర్షం లాంటిదే జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలం తరువాత వానాకాలం వస్తుంది. కానీ వానలు రావు. ఇప్పుడు ఇది మామూలే. అయితే మా చిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడూ వచ్చేది. వానలు పడకపొయ్యేవి. రైతులే కాదు అందరూ వానల కోసం ఎదురుచూసేవాళ్లు. బావుల్లో నీళ్లు అడుగంటుకొని పొయ్యేవి. బొక్కెనకి వున్న తాడు నీళ్లకు అందకపొయ్యేది. ఆ తాడుకు మరి కొంత తాడు కట్టి నీళ్లు ఊరిన తరువాత చేదుకునేవాళ్లు.
ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు మా వాడకట్టులో వున్న యువకులు ఓ గమ్మతె్తైన పూజ లాంటిది చేసేవాళ్లు. రోకలి బండకి ఓ కప్పను బట్టలో కట్టి మా వాడకట్టులోని అందరి ఇళ్ల దగ్గరికీ వచ్చి వాన రావాలని పాట పాడేవాళ్లు. వాళ్లతోపాటూ మేమూ ఆ పాటని పాడేవాళ్లం. కొన్ని సందర్భాలలో వర్షాలు వచ్చేవి. ఆ పూజల వల్లనో, సహజంగానో వచ్చేవి. ఇలా రానప్పుడు వరుణ యాగాలు కూడా చేసేవాళ్లు.
వర్షాలు బాగా పడినప్పుడు వూరంతా బురద బురదగా వుండేది. ఇప్పటిలా అప్పుడు సిమెంట్ రోడ్లు లేవు. డాంబరు రోడ్లూ లేవు. వర్షాలు పడాలని మేం ఎంతగా కోరుకునేవాళ్లమో, బురద గురించి అంతగా విసుక్కునే వాళ్లం. బురద గురించి తిట్టుకునే వాళ్లం.
మా తిట్టుకోవడం విన్న మా అమ్మ మాతో ఇలా అనేది.
‘ఒరే! బాబులూ వానతోబాటూ బురద కూడా వస్తుంది. వానతోబాటూ మెరుపులూ వస్తాయి. అప్పుడప్పుడు పిడుగులు కూడా పడతాయి. ఇవి సహజం అంతే.’
ఇంకా ఇలా అనేది-
‘వర్షం పడినందుకు కృతజ్ఞతలు చెప్పండి. బురద అంటకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి.’
నిజమే!
వర్షం వెంట బురద సహజమే!
ప్రతిదీ అంతే!
పెద్ద ఉద్యోగం రావాలని కోరుకుంటాం. ఆ ఉద్యోగంతోబాటూ కొన్ని కష్టాలూ వస్తాయి. బదిలీలూ వుంటాయి.
అందమైన మంచి భార్య కావాలని కోరుకుంటాం. కానీ ఆమెలోని కొన్ని లక్షణాలు మనకి నచ్చకపోవచ్చు.
అందుకని.. వర్షం లాంటిదే జీవితం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001