ఓ చిన్నమాట!
ఇంకా కొంచెం...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలేజీ రోజుల్లో, ఆ తరువాత కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న క్రమంలో ఎగ్జామ్స్ తేదీ అనౌన్స్ అయ్యేంత వరకు చదువుకోవడానికి మూడ్ రాకుండా పోయేది.
పరీక్షలు దగ్గరకొచ్చినప్పుడు తీక్షణంగా చదివేవాళ్లం. ఒక గంట సరిగ్గా కూర్చోలేని మేం పరీక్షల సమయంలో ఏకబిగిన మూడు గంటలు కూర్చుని చదివేవాళ్లం.
మాలో ఇంత ఓపిక వుందానని, మాకే ఆశ్చర్యం వేసేది. మామూలప్పుడు అర్థంకాని పాఠం అప్పుడు సరిగ్గా అర్థం అయ్యేది. జాగ్రత్తగా చదివేవాళ్లం. ఏకాగ్రతతో చదివేవాళ్లం.
చదువు కొంచెం ముందుగా ఇలా చదివితే ఎంత బాగుండూ అని ప్రతిసారీ అన్పించేది.
ఆ తర్వాత మామూలే!
మళ్లీ పరీక్షలప్పుడే అంత ఏకాగ్రత వచ్చేది. అందరూ మాలా వుండరు.
ప్రతిసారి ఏకాగ్రతతో చదువుతారు.
అదేవిధంగా ఏకాగ్రతతో వింటారు.
అందుకే వాళ్లు యూనివర్సిటీల్లో రాష్ట్రంలో మొదటి వరుసలో ఉంటారు.
అలా చాలా తక్కువ మంది ఉంటారు. మాలాంటి వాళ్లే ఎక్కువమంది ఉంటారు.
ఇంకా కొంచెం ముందు ఇలా చదివితే బాగుండునని అనుకునే వ్యక్తులే ఎక్కువ మంది ఉంటారు.
ఒక్క పరీక్షల విషయంలోనే కాదు.
చాలా విషయాల్లో ఇంకా కొంచెం ముందు అలా చేస్తే బాగుండునని అనుకునే వ్యక్తులు చాలామంది వుంటారు.
ఇంకా కొంచెం పరిగెడితే బాగుండు.
ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసి పాడితే బాగుండు.
ప్రేమించానని ఇంకా కొంచెం గట్టిగా చెబితే బాగుండునని అనుకునేవాళ్లు మరెంతో మంది. చనిపోయిన వాళ్లని ఇంకా కాస్త ప్రేమతో చూస్తే బాగుండునని.. ఇట్లా..
ఇంకా కొంచెం..
ఇంకా కొంచెం..
చేస్తే బాగుంటుంది.
అద్భుతాలు జరగాలంటే ఇంకా కొంచెం చేసి ఉండాలి.
అద్భుతాలంటే గొప్ప విషయాలే కాదు.
మామూలు విషయాలు కూడా అద్భుతాలే.
ఇంకా కొంచెం శక్తి కూడదీసుకుని పనిచేస్తే..
ఇంకా కొంచెం బద్దకం వదిలేస్తే...
ఇంకా కొంచెం నిద్రని త్యాగం చేస్తే...
మరెంతో బాగుంటుంది.