ఓ చిన్నమాట!

ధ్యానంలో కోరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఫ్లాట్లల్లో, విల్లాల్లో నివసిస్తున్న వ్యక్తుల వాట్సప్ గ్రూపుల్లో ఈ సమస్య తరచూ ప్రస్తావించబడుతోంది. నీటి ఎద్దడి గురించి, తగు జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని సందేశాలు వస్తూనే ఉంటాయి. ఈ సందేశాలకి భిన్నంగా మల్లాది శ్రీకాంత్ అనే మిత్రుడు ఓ సందేశాన్ని, ఓ వీడియోని ఫార్వర్డ్ చేశాడు.
ఆ సందేశ సారాంశం ఏమిటంటే నీటి ఎద్దడి గురించిన విషయాలు, ఫొటోలు తరచూ షేర్ చేసుకునే బదులుగా బాగా వర్షాలు కురియాలని రోజూ ఓ నిమిషం ధ్యానం చేస్తే బాగుంటుందని. ఆశావహ దృక్పథ శక్తి వల్ల మంచి వర్షాలు పడతాయని సూచించారు. నీటితో పిల్లలు ఆడుతున్న దృశ్యాలని, వర్షం దృశ్యాలని షేర్ చేసుకోమని సూచించారు. ఆయన షేర్ చేసిన వీడియో నీళ్లు జలజలా ప్రవహిస్తూ ఉన్నాయి.
ఆశావహ దృక్పథానికి అంతటి శక్తి వుంటుందానన్న సందేహం సహజంగానే వస్తుంది. దీనికి ఎవరూ హామీ ఇవ్వలేం కానీ మంచి విషయాలను ఆశిస్తే మంచే జరుగుతుంది. ఇవేవీ చెప్పకుండా మన పెద్దవాళ్లు ‘ఎప్పుడూ మంచినే తలుచుకో’ తథాస్తు దేవతలు వుంటారని మనకి చెప్పారు.
ఈ విషయాన్ని విశ్వసించాల్సిందే!
విశ్వసించడం వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు.
మనం ఆఫీస్‌కి వెళ్లినప్పుడు పనులు బాగా జరగాలని కోరుకుంటాం. ఉదయానే్న వాకింగ్ చేస్తున్నప్పుడు దానివల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుందని ఆశిస్తాం.
ఓ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో నుంచి కొంత జ్ఞానం మనకు లభించాలని కోరుకుంటాం.
మనం ఏవైనా కొత్త విషయాలు నేర్చుకుంటే వాటిని త్వరగా ఇతరులకి చెప్పాలని కోరుకుంటాం.
మన మనస్సు అన్నింటికన్నా శక్తివంతమైనది. మన మనస్సు కోరుకున్న విధంగా పనులు జరగాలని నియమం లేదు. కానీ ఆ విధంగా జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
ఎవరూ దేనికీ హామీ ఇవ్వలేరు. కానీ మంచి కోరుకోవడం వల్ల మంచే జరుగుతుంది.
మరి-
ఈ రోజు మీరు ఏమి కోరుకుంటున్నారు?
కోరుకోవడమే కాదు - ఆ కోరిక ఫలప్రదం అయ్యే విధంగా మన చర్యలు వుండాలి.
అది నీటి గురించే కావొచ్చు.
చెట్టు గురించే కావొచ్చు.
మీ గురించే కావొచ్చు.
మీ పిల్లల గురించే కావొచ్చు.
సర్వజనుల గురించే కావొచ్చు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001