ఓ చిన్నమాట!

తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేచీ లేవగానే వాట్సప్ మెసేజెస్ చూడటం అందరికీ అలవాటు అయిపోయింది. తమ ప్రమేయం లేకుండానే చాలామందిని గ్రూపుల్లో చేరుస్తూ ఉంటారు. గుడ్‌మార్నింగ్‌లు, గుడ్‌నైట్లతో బాటు అనేక వీడియోలు వచ్చి చేరి మొబైల్ ఫోను బరువెక్కిపోతూ ఉంటుంది.
మెసేజీలని, వీడియోలని చూడటం వాటిని తొలగించడం చేస్తూ ఉంటారు చాలామంది. ఫోన్ కెపాసిటీకి మించి పోతే ఫోను పనిచేయకుండా అవుతుంది. అలా తప్పని పరిస్థితుల్లో వీడియోలని, మెసేజీలని తొలగిస్తూ ఉంటారు. అనవసరమైన వాటిని వెంటనే తొలగిస్తారు.
మన మనస్సు కూడా అలాంటిదే.
ఫోన్‌లాగా దాని కెపాసిటీ మనం నిర్ధారించలేం. ఎన్నో విషయాలని మన మనస్సు దాచి ఉంచుకోగలదు. అలా అని దాన్ని బరువెక్కించకూడదు.
అనవసర విషయాలని మనస్సు నుంచి తొలగిస్తూ పోవాలి. ఈ పనిని ఉదయమే కాదు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ ఉండాలి.
తక్కువ లోడ్ వుంటే మొబైల్ ఫోన్ త్వరగా పని చేస్తుంది.
కంప్యూటర్ అంతే!
లాప్‌టాప్ కూడా అంతే!
ఈ తొలగించుకోవడం కన్నా ముఖ్యం వాటిని స్టోర్ చేయకపోతే మంచిది.
ఇలాంటి ఆప్షన్ ఫోన్లలో వుంటుంది.
అవి ఆటోమేటిక్‌గా ఫోన్లోకి వెళ్లవు. పంపిన వ్యక్తి మెసేజీల్లోనే ఉంటాయి.
ఫోన్‌కి మన మనస్సుకి ఒక వ్యత్యాసం ఉంది. మన ప్రమేయం లేకుండా మన మనస్సులోకి ఇతరులు ఏవీ పంపించే అవకాశం లేదు.
దానికి కావల్సింది ఒక్కటే.
మన మనస్సు మీద మన నియంత్రణ.
అవసరం లేని విషయాలకి చెడు విషయాలకి మన మనస్సులో చోటుని ఇవ్వకపోతే - తొలగించుకోవాల్సిన బాధ ఉండదు.
మనం నియంత్రించుకున్నా కొన్ని విషయాలు మన మనస్సులోకి వెళతాయి. వాటిని తొలగించాలి.
మొబైల్ ఫోన్‌నే కాదు
మనస్సుని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
అనవసర విషయాలని తొలగిస్తూ ఉండాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001