ఓ చిన్నమాట!

పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య బ్యాంక్‌కి ఓ చిన్న పని మీద వెళ్లాను. నా పని చూసుకొని వెనక్కు తిరగగానే ఒక్క నిమిషం పెన్ను ఇస్తారా? అని ఓ కుర్రవాడు అడిగాడు.
ఇచ్చాను. ఆ కుర్రవాడు పని పూర్తి చేసుకునేదాకా అక్కడే కూర్చున్నాను. ఐదు నిమిషాల తరువాత నా పెన్ను తిరిగి ఇచ్చాడు. బ్యాంక్‌కి వస్తున్నప్పుడు పెన్ను లేకుండా రావడం నాకు నచ్చలేదు. ఐదు రూపాయలకే మంచి పెన్ను దొరుకుతున్న కాలం ఇది. సలహా ఇద్దామని అనుకొని మానుకున్నాను.
ఐదు నిమిషాల కోసం పెన్ను ఇచ్చినందుకు ఓ చిన్న ఉపన్యాసం ఇస్తున్నానని అతను అనుకుంటాడని సలహా ఇవ్వడం మానేశాను.
చాలామంది ఇళ్లల్లో పెద్దపెద్ద టీవీలు ఉంటాయి. కానీ ఓ చిన్న కాగితం ముక్క కోసం ఎంతో వెతుకుతారు. అట్లాగే పుస్తకాలు కన్పించవు. మ్యాగజిన్లు కూడా కన్పించవు.
పెద్ద లైబ్రరీలు, హోమ్ థియేటర్లు, చిన్న లైబ్రరీలు. ఏమైనా అంటే అన్నీ ఇంటర్నెట్‌లో దొరుకుతాయి కదా అనే సమాధానం వస్తుంది.
ఇంటర్నెట్‌లో పుస్తకం మొత్తం దొరకదు.
పుస్తకాన్ని పుస్తకంలా చదివే వీలు అందులో ఉండదు. టీవీలు చూడ్డానికి, సినిమాలు చూడ్డానికి, ఈ మధ్యన యూ ట్యూబ్‌లో సినిమాలు చూడ్డానికి అలవాటు పడినారు. ఇవి అవసరమే. కాదని అనను. కానీ చదవడం చాలా అవసరం. ఎంతమంది ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. ఓ గొప్ప పుస్తకాన్ని ఎంతమంది చదువుతున్నారు?
ఎక్కువ పుస్తకాలు చదివే వాళల్లు ఎక్కువగా ఆశావహంగా ఉంటారు.
ఇప్పుడు ఇంటి నుంచే పని.
ఇంటి నుంచే అన్నీ.
స్విగ్గీ, కూరగాయలు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.
మనుషులతో సంబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి.
పుస్తకాలు చదవాలి.
మనుషులని చదవాలి.
పుస్తకాల్లో కన్పించని మనుషులు సమాజంలో కన్పిస్తారు.
సమాజంలో కన్పించని మనుషులు పుస్తకాల్లో కన్పిస్తారు.
వినోదం, విజ్ఞానం ఎంత ముఖ్యమో మనుషులని అర్థం చేసుకోవడం అంతకన్నా ముఖ్యం. అర్థం కావాలంటే పుస్తకాలని చదవాలి. మనుషులను కలవాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001