ఓ చిన్నమాట!

ప్రార్థన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది ఉదయం స్నానం వగైరా ముగించుకున్న తరువాత పూజాగదిలోకి వెళతారు. దేవున్ని పూజిస్తారు. ప్రార్థిస్తారు.
తిరుపతి వెళతారు.
వేములవాడ వెళతారు.
షిరిడీ వెళతారు.
ఇంట్లో పూజ చేసినా, యాత్రా స్థలాలకు వెళ్లి దేవుడిని మొక్కుకున్న అందరూ కోరేది ఒక్కటే.
నాకు ఇది కావాలి.
నాకు అది కావాలి.
ఈ కోరికలతోనే పూజ చేస్తారు. ఏవీ కోరకుండా పూజ చేసే వ్యక్తులు అరుదు. ఇందుకు మినహాయింపు ఎవరూ కాదు.
మన చిన్నప్పుడు అమ్మ మనం ఏవీ అడగకుండానే అమర్చి పెడుతుంది. మరి దేవుడు మనం కోరకున్నా మనకు కావల్సింది ఇవ్వడా అన్న ప్రశ్న వేస్తే చాలా మంది ‘అడగనిది అమ్మైనా పెట్టదు’ అన్న పద బంధాన్ని చెబుతారు. ఆ పదబంధం యొక్క సందర్భం వేరు. పెద్దవాళ్లం అయిన తరువాత ఆ పరిస్థితి ఉంటుందేమో కానీ చిన్నప్పుడు అలాంటి పరిస్థితి వుండదు. మనకు కావల్సినవి అన్నీ అమ్మే సమకూరుస్తుంది.
భగవంతుని ముందు మనం అందరం చిన్నపిల్లలమే. మనం ఏ కోరిక కోరకుండా పూజ చేయవచ్చు. ప్రార్థన చేయవచ్చు.
ఒకవేళ మనం ఏమైనా కోరాల్సి వస్తే - ఈ విధంగా కోరతాం.
ఇతరులని ఆశీర్వదించే విధంగా
ఇతరులకి సహాయపడే విధంగా శక్తియుక్తులూ ప్రసాదించు తండ్రీ.
ఇది కూడా కోరికే.
అయితే ఈ ఒక్క కోరికలో ఎన్నో మిళితమై ఉన్నాయి.
ఎలాంటి కోరిక కోరకుండా పూజ చేస్తే, ప్రార్థన చేస్తే అదీ మరీ మంచిది.
అలా ఎంతమందిమి వుండగలం? మిలియన్ డాలర్ల ప్రశ్న.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001