ఓ చిన్నమాట!

‘రంపం’ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య రంపం గురించి ఓ కథ చదివాను. అది నాకు బాగా నచ్చింది. అది జీవితానికి అన్వయించుకుంటే కొంచెం ప్రశాంత జీవితం లభిస్తుందని అన్పించింది. అందుకే ఆ కథ ఈ వారం మీ కోసం -
ఓ పాము అనుకోకుండా ఓ రోజు వండ్రంగి ఇంట్లోకి ప్రవేశించింది. మొదటి గది నిండా ఆయన పనిముట్లు వున్నాయి. అనుకోకుండా ఆ పాము రంపం దగ్గరికి వెళ్లడం వల్ల దానికి కొన్ని గాయాలైనాయి. ఆ గాయాల వల్ల ఆ పాముకి బాధ కలిగించింది. రంపం మీద కోపం కూడా కలిగింది.
వెంటనే రంపానికి ఊపిరి సలపకుండా చేయాలని అన్పించి దాని చుట్టూ తన శరీరాన్ని చుట్టి రంపాన్ని కాటేసే ప్రయత్నం చేసింది. రంపంకి ఏమీ అవలేదు. పాము తీవ్రంగా గాయపడింది. నోటి దగ్గర నుంచి ఒళ్లంతా గాయాలైనాయి. చివరికి ఆ రక్త గాయాల వల్ల ఆ పాము చనిపోయింది.
రంపం లాంటి సంఘటనలు కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనకూ బాధ కలుగుతుంది. ఈ బాధ కొన్నిసార్లు అనుకోకుండా జరగవచ్చు. మరికొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా చేసింది కావొచ్చు.
ఏ రకంగా జరిగినా బాధ బాధే. అయితే ఇక్కడ మనకి ఒక అవకాశం వుంది.
ఓ గట్టి నిట్టూర్పు తీసుకొని మనకు బాధ కలిగించిన వ్యక్తిని క్షమించి ముందుకు వెళ్లవచ్చు.
లేదా పాము మాదిరిగా ప్రవర్తించి, ఇంకా ఎక్కువ బాధని కలుగజేసుకోవచ్చు.
నిర్ణయం మనదే! క్షమించడమా? పగ సాధించడమా? ప్రశాంతతని కొనుక్కోవడమే మనం చేయాల్సింది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001