ఓ చిన్నమాట!

జీవితాలను మార్చే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టామ్ పీటర్, మేనేజ్‌మెంట్ గురు తన కొత్త పుస్తకంలో ఈ కొత్త కథని చెప్పాడు. కథ మామూలుగా అన్పిస్తుంది. కానీ జీవితాలని మార్చే కథ.
ఆ కథ ఇలా మొదలవుతుంది. జె.పి.మోర్గాన్ అన్న వ్యక్తి దగ్గరికి ఓ వ్యక్తి వస్తాడు. ఆయన చేతిలో ఓ ఎన్విలప్ ఉంటుంది.
ఆ వ్యక్తి మోర్గాన్‌తో ఇలా అంటాడు. ‘సార్! జీవితంలో విజయం సాధించే ఫార్ములా ఒకటి నా దగ్గర ఉంది. తప్పక విజయం సాధిస్తారు. అయితే ఈ ఫార్ములా ఖరీదు 25,000 డాలర్లు’ చేతిలో కవర్ అతనికి చూపించాడు.
ఆ కవర్‌లో ఏమి ఉందో నాకు తెలియదు, విజయం సాధించే ఫార్ములా ఆ కవర్‌లో వుందో లేదో నాకు తెలియదు. కానీ నేను ఆ ఫార్ములా చూసి సంతృప్తి చెందితే తప్పక నీవు కోరిన ఖరీదు ఇస్తాను’ అని జవాబు చెబుతాడు మోర్గాన్.
ఆ విషయం గురించి ఇద్దరి దగ్గర ఏకాభిప్రాయం కుదురుతుంది. ఆ వ్యక్తి తన దగ్గర వున్న కవర్‌ని మోర్గాన్ చేతిలో పెడతాడు.
మోర్గాన్ ఆ కవర్ తెరిచి ఫార్ములా చదువుతాడు. సంతృప్తి చెందుతాడు. మళ్లీ ఆ కవర్‌లో ఆ కాగితాన్ని ఆ కవర్‌లో ఉంచేసి అతనికి తిరిగి ఇచ్చేస్తాడు. అంగీకరించిన విధంగా దాని ఖరీదు కూడా చెల్లిస్తాడు.
ఆ కవర్‌లోని కాగితం ఈ విధంగా ఫార్ములా వుంటుంది.
‘ఆ రోజు చేయాల్సిన పనులని ఆ ఉదయం రాసి ఉంచండి. అంతేకాదు. ఆ పనులు పూర్తి చేయండి’
ఇదీ కథ జీవితాలని మార్చే కథ.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001