ఓ చిన్నమాట!

జీవిత చరమాంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవిత చరమాంకంలో చాలామందికి జ్ఞానోదయం కలుగుతుంది. క్షమాగుణం వచ్చేస్తుంది. ఇతరుల పట్ల తాము కఠినంగా వ్యవహరించామని అన్పిస్తుంది. ఇది సహజం.
అయితే సమాజం గురించి ఆలోచించే రచయితలు సంపాదకులలో కూడా ఇలాంటి జ్ఞానోదయం జీవిత చరమాంకంలో కలగడం ఆశ్చర్యంకన్నా, బాధ ఎక్కువ కలుగజేస్తుంది.
నాకు బాగా తెలిసిన ఓ ప్రముఖ రచయిత చాలా పత్రికల్లో సంపాదకుడిగా వ్యవహరించాడు. అతను చేసిన కొన్ని చిన్న తప్పిదాల వల్ల ఓ పత్రిక అతనికి ఉద్వాసన పలికింది. ఆ తరువాత అతను చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఆయన స్థాయికి తగని చిన్న ఉద్యోగాలు కూడా చేశాడు.
కొంతకాలం తరువాత ఓ కొత్త పత్రిక వచ్చింది. దానికి అతన్ని సంపాదకుడిగా బాధ్యతలు అప్పగించారు. అతనికి బాగా సన్నిహితంగా ఉండే మరో మిత్రునితో సంభాషిస్తూ గతంలో మాదిరిగా చేయకపోతే బాగుంటుందని స్నేహపూర్వకంగా నేను ఓ మంచి మాట చెప్పాను.
నేను అలా చెప్పడంలో ఉద్దేశం కూడా చెప్పాను. ఇక్కడ కూడా అతను ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని, అతని సంపాదకత్వంలో ప్రజలకి మంచి జరుగుతుందని నా విశ్వాసమని కూడా చెప్పాను. మా మిత్రుడు నేను చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అది కాకుండా నా మాటల్ని ఆ సంపాదక మిత్రునికి కూడా చెప్పాడు. అతనూ అపార్థం చేసుకున్నాడు.
ఆ తరువాత ఓ చిన్న పని మీద ఆ సంపాదకుడికి ఫోన్ చేస్తే కాస్త నిర్లక్ష్యంగా మాట్లాడినాడు. మరోసారి అతన్ని కలిసినప్పుడు కూడా సరిగ్గా స్పందించలేదు. నేను మామూలుగా ఉండిపోయాను.
కొంతకాలం తరువాత అతను అనారోగ్యం పాలైనాడు. జీవిత చరమాంకంకి చేరుకున్నాడు. ‘నన్ను చూడాలని ఉంద’ని మా మిత్రుడితో కబురు పెట్టాడు. ఓ రెండుసార్లు మా మిత్రుడు ఆ మాట చెప్పిన తరువాత ఇద్దరమూ కలిసి అతని దగ్గరకు వెళ్లాం.
కాస్సేపు మాట్లాడుకున్న తరువాత అతను నా చేయి పట్టుకొని చాలాసేపు వదల్లేదు. కానీ ఆ స్పర్శలో అంతులేని భాష ఉంది. మాటల్లో చెప్పలేని అపరాధ భావం ఉంది. అతను ఏం చెప్పదల్చుకున్నాడో నాకు అర్థమైంది. కాసిన్ని మంచి మాటలు మాట్లాడాను. త్వరగా కోలుకోవాలని కాంక్షించాను.
మనుషుల్లో జ్ఞానోదయం మరణశయ్య మీద ఉన్నప్పుడు కాకుండా ముందే కలిగితే ఎంత బావుంటుందని అప్పుడు అన్పించింది.
మరణశయ్య మీద లేని వ్యక్తులు ఎవరున్నారు ఈ ప్రపంచంలో..? ఎవరికి తెలుసు ఏది చివరి రోజో...
మరణం ఆసన్నమయ్యేంత వరకు ఎందుకు వేచి చూడాలి..? ఈ అనుభవాన్ని ముందే పొందితే ఎంత బాగుంటుంది.
ప్రతిరోజును కానుకగా ఎందుకు పరిగణించకూడదు.
మనలోని మంచి గుణాలని, క్షమాగుణాన్ని
కరుణని ఎందుకు ద్విగుణీకృతం చేసుకోకూడదు.
మన టాలెంట్స్‌ని పూర్తిగా ఎందుకు ఉపయోగించుకోకూడదు..?
మన ప్రపంచాన్ని మార్చడానికి
ఎందుకు ప్రయత్నం చేయకూడదు.

జింబో 94404 83001