ఓ చిన్నమాట!

మిణుగురులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా చిన్నప్పుడు సీతాకోక చిలుకలు, ఆరుద్ర పురుగులు, మిణుగురులు మమ్మల్ని ఎక్కువగా ఆకర్షించేవి. ఆరుద్ర పురుగులు మఖుమల్ లాగా మెత్తగా ఉండేవి. మిణుగురులు వెలుగుతూ కన్పించేవి. సీతాకోక చిలుకల తరువాత పిల్లలని ఎక్కువగా ఆకర్షించేవి ఈ ఆరుద్ర, మిణుగురు పురుగులు.
ఈ మూడింటితో మా కాలంలోని చిన్నపిల్లల జీవితాలు ముడిపడి ఉండేవి. ఇప్పటి పిల్లలు ఇలాంటి వాటికి దూరం. అవి ఏమిటో కూడా వాళ్లకి తెలియవు. ప్రకృతికి దూరంగా ఇప్పటి పిల్లలు పెరుగుతున్నారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ప్రకృతికి దూరం అయిపోయినారు.
మిణుగురు పురుగులు క్రింది భాగం ప్రకాశిస్తూ కన్పించేవి. కొంత చీకటిగా ఉంటే వాటి వెలుతురు ఎక్కువగా కన్పించేది. మిణుగురుల లాంటివి కొన్ని వందల రకాలు వున్నాయట.
కొన్ని వెలిగేవి.
కొన్ని మెరిసేవి.
కొన్ని మిణుకు మిణుకుమనేవి.
అవి ఎలా వున్నా అవి చీకటిలో మెరిసేవి. అవి కన్పించిన రోజూ పిల్లలు ఆనందంతో ఊగిపోయేవాళ్లు.
ఈ మిణుగురులను చూసి కూడా ఎంతో నేర్చుకోవచ్చు.
అవి ఎక్కడికి పోయినా ఎంతో కొంత వెలుగుని ఇస్తాయి. చీకటిని తగ్గించే ప్రయత్నం చేస్తాయి.
మనలో కూడా ఏవో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అవి మిణుగురుల్లాగా బయటికి తెలియకపోవచ్చు. కొంత ప్రయత్నం చేస్తే ఎవరికి వారు కనుగొనే అవకాశం ఉంది. మన మిత్రులతో వున్న ప్రత్యేకతలను మనం కనుక్కోవచ్చు. వాళ్లని ఆ దిశగా తీసుకొని వెళ్లవచ్చు. అప్పుడు వాళ్లు కూడా ఈ లోకంలో వున్న చీకటిని కొంత మేరకైనా తొలగించే ప్రయత్నం చేయవచ్చు.
ఈ ప్రపంచంలో ఎంతో అంధకారం ఉంది. వ్యతిరేక భావనలు ఉన్నాయి. వాటిని తగ్గించడానికి మన ప్రయత్నం మనం చేయవచ్చు. వాటిని పూర్తిగా మనం తొలగించలేక పోవచ్చు. కానీ కొంత మేరకైనా తగ్గించే అవకాశం ఉంది.
మన శక్తి వల్ల, సామర్థ్యం వల్ల కొంతమేరకు వ్యతిరేక భావనలని తగ్గించే అవకాశం ఉంది. ఎంతమేరకు తగ్గిస్తామన్నది వేరు విషయం. కానీ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి.
మిణుగురులని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇదే!

జింబో 94404 83001