ఓ చిన్నమాట!

నొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు చాలామంది చిత్రకారులతో స్నేహం ఉంది. తోట వైకుంఠం, ఏలే లక్ష్మణ్, రాజేశ్వర్, ఆగాచార్యా ఇట్లా చాలా మంది మిత్రులు ఉన్నారు. అట్లాంటి మరో మిత్రుడు కె.నరేంద్రనాథ్. ఆయన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి. మంచి పెయింటింగ్స్ వేశాడు. అతను హకీంపేట కేంద్రీయ విద్యాలయంలో పని చేస్తున్నాడు.
నా కవిత్వం పుస్తకానికి, కథల పుస్తకానికి రెండు మంచి బొమ్మలు ముఖచిత్రంగా వేసి ఇచ్చారు నరేంద్రనాథ్. వాటి పేర్లు ‘జమానత్’. చూస్తుండగానే... జమానత్ అన్న కథల పుస్తకాన్ని శ్రీనివాసరెడ్డి ఇంగ్లీషులోకి అనువాదం చేశారు.
ఈ రెండు పుస్తకాలే కాకుండా మా ఆవిడ హిమజ రాసిన ‘ఆకాశమల్లే’ కవిత్వం పుస్తకానికి కూడా ఓ అందమైన బొమ్మ వేసి ఇచ్చాడు. ఆ మూడు బొమ్మలు మా ఇంటి గోడల మీద వేలాడుతున్నాయి.
ఈ మధ్య ఆయన పెయింటింగ్స్ చూద్దామని వాళ్లింటి నేనూ మా ఆవిడా వెళ్లాం.
ఆయన వేసిన పెయింటింగ్స్ అన్నీ చూశాను. కొత్తవి కన్పించలేదు.
‘కొత్త పెయింటింగ్స్ వేయడం లేదా?’ అని అడిగాను.
‘చాలా తక్కువగా వేస్తున్నాను సార్! మెడలు నొప్పి పెట్టి తల దిమ్మెక్కిపోతోంది’ జవాబు చెప్పాడు.
‘మరి ఈ మధ్య బుద్ధుడి బొమ్మని నాకు వాట్సప్‌లో పంపించారు కదా! అది కొత్తది కాదా...’ అడిగాను.
‘కొత్తదే సార్! ఇప్పుడు ఐ పాడ్ మీద వేస్తున్నాను. తల పూర్తిగా వంచాల్సిన అవసరం లేదు. ఇది కాస్త తక్కువ నొప్పిగా ఉంటుంది’ చెప్పాడు నరేంద్రనాథ్.
ఆయనకు ఉద్యోగం ఉంది. అది వృత్తి.
బొమ్మలు వేయడం ఆయన ప్రవృత్తి.
‘అంతగా నొప్పి వుంటే మానెయ్యచ్చు కదా’ అన్నాను.
అతను చిన్నగా నవ్వి, ‘మీకు సమాధానం తెలిసి అడుగుతున్నారు. అప్పుడు నొప్పి, బాధ ఇంకా ఎక్కువ అవుతాయి. బొమ్మలు వేయడం లేదన్న బాధ కన్నా బొమ్మలు వేస్తూ బాధపడటం మంచిదని బొమ్మలు వేస్తున్నాను’
నిజమే!
బతికి వున్నంత కాలం కళాకారుడు పని చేస్తూనే ఉంటాడు. పని చేయకపోతే తోచదు.
దాశరథి రంగాచార్య గారు రాయడం కష్టంగా వున్నప్పుడు డిక్టేషన్ ఇచ్చేవారు.
కష్టం, బాధ, నొప్పి ఇవీ వుంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి పని చేస్తూ ఉండాలి.
నరేంద్రనాథ్‌ని కలిసిన తరువాత ఈ విషయం మళ్లీ ధృవపడింది నాలో.

జింబో 94404 83001