ఓ చిన్నమాట!

మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను వరంగల్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక లేడీ టైపిస్ట్ ఉండేది. ఆమె ఎప్పుడూ కోర్టుకి ఆలస్యంగా వచ్చేది. కోర్టులో కాల్‌వర్క్ (కేసులని పిలవడం) అయిపోవడానికి గంట సమయం పట్టేది. పదకొండున్నరకి ఆమె వచ్చేది. అది గమనించడానికి నాకు పదిహేను రోజులు పట్టింది. ఆ తరువాత ఆమెను హెచ్చరించాను. రెండు రోజులు సమయానికి వచ్చేది. ఆ తరువాత మళ్లీ ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చేది.
మా కోర్టులో ఓ క్లర్క్ ఉండేవాడు. అతను ఆమెలా లేటు కాదు గానీ ఓ పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చేవాడు. ఆలస్యంగా వచ్చినా తన పనులన్నీ సక్రమంగా పని చేసేవాడు. ఆఫీసర్స్ పనులని కూడా జాగ్రత్తగా చేసేవాడు. అందువల్ల అందరూ అతన్ని ఏమీ అనేవాళ్లు కాదు.
సమయానికి రావాలని అతనితో ఓ రోజు చెప్పాను. ఓ వారం రోజులు సరిగ్గా వచ్చాడు. ఆ తరువాత మళ్లీ మామూలే. పదిహేను నిమిషాలు ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు.
మా సూపరింటెండెంట్‌ని అడిగాను. అతను ఆలస్యంగానే వస్తున్నాడని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు.
‘అతని దగ్గర పని పెండింగ్‌లో ఉండదు సార్. ఆఫీసు పనులే కాకుండా బయటి పనులు కూడా అతను చేస్తున్నాడు కదా సార్! అందుకని చూసీ చూడనట్టుగా ఉంటున్నాను సార్!’
అక్కడితో ఊరుకోకుండా ఇంకో మాట కూడా అన్నాడు.
‘మన టైపిస్ట్‌కన్నా నయం కదా సార్! ఆమె ఎన్నిసార్లు చెప్పినా లేట్‌గా వస్తుంది’
ఆఫీసులో అందరూ టైపిస్ట్‌కన్నా బెటర్ అన్న ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు. నిజమే! లేడీ టైపిస్ట్ కన్నా అందరూ బెటరే!
ఆలోచించి కోర్టు సమయం ముగిసిన తరువాత స్ట్ఫా నందరినీ పిలిచాను.
‘మీరందరూ ఆఫీసుకి రావడంలో టైపిస్ట్‌కన్నా బెటరే. అందులో అనుమానం లేదు. కానీ ఆ విధంగా పోల్చుకోవడం సరైంది కాదు. ఆమెతో మీరు పోల్చుకోకూడదు. మీరు పోల్చుకోవాల్సింది మీతోనే. ఆలస్యంగా, వచ్చేవాళ్లతో పని చేయని వాళ్లతో పోల్చుకోకూడదు.
నిన్నటికన్నా మీరు అన్ని విషయాల్లో ఏ విధంగా మెరుగ్గా ఉన్నారు. ఆ విషయంతో పోటీ పడండి.
మంచిగా పని చేయడానికి ప్రయత్నించండి.
టైపిస్ట్‌తోనో, పని చేయని వాళ్లతోనో పోల్చుకొని మీరు మెరుగని ఆనందపడకండి.
నిన్నటి మీకన్నా మీరు ఈ రోజు ఏ విధంగా మెరుగ్గా ఉన్నారో ఆలోచించండి. మెరుగ్గా ఉంటే ఆనందపడండి. అంతే’ చెప్పాను అందరితో.
‘లేడీ టైపిస్ట్‌కి వున్న సమస్యలు మీకు లేవు. అయినా ఆమె సరైన టైంకి రావల్సిందే! లేకపోతే ఆమె సెలవులు కట్ అయిపోతాయి’ హెచ్చరించాను.
ఆ తరువాత అందరి పనిలో మార్పు కనిపించింది.
ఆఫీసుకి రావడంలో ఆలస్యం తగ్గింది.

- జింబో 94404 83001