ఓ చిన్నమాట!
దృఢ నిశ్చయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది.
ఈ ప్రపంచంలోని మనుషులు ఇంకా వింతగా ఉంటారు.
ఎవరైనా సవాలు విసిరితే చాలా మంది నిరుత్సాహ పడతారు. కొంతమంది దాన్ని స్వీకరించి విజయంవైపుప్రయాణం చేస్తారు.
1960 సంవత్సరంలో అంతరిక్షంలో ప్రయాణం చేయడం అనేది దుస్సాధ్యం అన్న అభిప్రాయం ప్రపంచంలో వుండేది. కాని ఆ తరువాత 10 సంవత్సరాలలో మనిషి చంద్రుని మీద కాలు మోపాడు. ఇదొక అద్భుతమైన విజయం.
ఈ కలని అమెరికన్లు నిజం చేశారు.
దుస్సాధ్యమన్న సవాలును సైంటిస్టులు స్వీకరించి సాధ్యం చేశారు.
దీన్ని జీవితానికి వర్తింప చేసుకోవచ్చు అన్నది ప్రశ్న.
చేసుకోవచ్చని చాలామంది అంటున్నారు. దానికి కావల్సింది మన మీద మనకి నమ్మకం.
నమ్మకం మాత్రమే వుంటే సరిపోదు. మనలో వున్న భయాలని పోగొట్టుకోవాలి. మన తప్పులని గుర్తించి సరిచేసుకోవాలి.
మన లక్ష్యాన్ని సరిచేసుకోవాలి. మన తెలివితేటలని పెంచుకోవాలి.
అన్నింటి కన్నా ముఖ్యమైంది మన సమయాన్ని రక్షించుకోవడం. అదే విధంగా క్రమశిక్షణ.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. దాంతోపాటూ ‘దృఢ నిశ్చయం’ ఉండాలి. దృఢ నిశ్చయం వుంటే మన అడుగు ముందుకు పడుతుంది. సందిగ్ధం సందేహాలు వుంటే అడుగు ముందుకు పడదు.
చంద్రుని మీద మనిషి కాలుమోపడం అన్నది ఓ ఉదాహరణ మాత్రమే.
చరిత్రలో అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
క్రమశిక్షణ, దృఢ నిశ్చయం, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్నది సాధించగలం. ఇది తొంభై శాతం అయితే, కాలం కలిసి రావడం అన్నది పది శాతం మాత్రమే.