ఓ చిన్నమాట!
నీరు చెప్పిన పాఠం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గత పది నెలల నుంచి ఓ గేటెడ్ కమ్యూనిటీలో వుంటున్నాను. కాలనీకి సంబంధించిన విశేషాలూ, వార్తలు అన్నీ వాట్సప్ గ్రూప్‌లో వస్తూ వుంటాయి. డ్రైవర్ కావాలన్నా, పనిమనిషి, వంట మనిషి కావాలన్నా అన్నీ అందులో అడుగుతూ ఉంటారు. ఎవరో ఒకరు వాటికి సమాధానాలని ఇస్తూ వుంటారు.
ఎప్పుడైనా నీటి సమస్య తాత్కాలికంగా ఏర్పడితే ఓ పది సందేశాలు వస్తాయి. చాలా విషయాలు ఆ గ్రూప్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ నీటి సమస్య లేదు. 24 గంటలు నీరు సమృద్ధిగా లభిస్తుంది.
గత రెండు మూడు రోజులుగా ఓ సమాచారం వచ్చింది. ఫలానా తేదీన నీటి పైపుల రిపేరు వుందని, అందుకని మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీటి సరఫరా వుండదని ఆ సమాచార సారాంశం.
ఆ ఫలానా రోజు రానే వచ్చింది. మా ఇంట్లో అందరూ త్వరగా పనులు ముగించుకున్నారు. పది గంటలలోపే టిఫినే్ల కాదు వంట కూడా అయిపోయింది. ఈ ఆధునిక బాత్రూంలలో బకెట్లు కూడా వుండవు. బిందెల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అవి కన్పించవు.
ఉదయానే్న బకెట్లూ, రెండు బిందెలు తీసి శుభ్రం చేయించి నీళ్లు నింపి పెట్టింది మా ఆవిడ. బహుశా అందరి ఇళ్లల్లోనూ ఈ విధంగానే జరిగి ఉంటుంది.
ఏ సమయం నుంచి ఏ సమయం దాకా నీళ్లు రావో మనకి తెలుసు. ఆ తరువాత మళ్లీ వస్తాయని తెలుసు. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆశ్చర్యం వేసింది.
జీవితం సంగతి గుర్తుకొచ్చింది.
ఈ సృష్టి, ఈ దేవుడు మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పరు. మనకూ తెలియదు. కానీ ఈ విషయం మనందరికీ తెలుసు.
తెలిసి కూడా మన సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నాం.
ఎవరో ఒకరిద్దరు తప్ప - ఎవరూ తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని నాకన్పిస్తుంది.
మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
చెప్పేవాళ్లు లేరు.
నీళ్ల మాదిరిగా మళ్లీ జీవితం రాదు.
ఈ విషయం అనుక్షణం గుర్తుకు రావాలి.
కాలాన్ని నిల్వ వుంచుకోలేం.
దాచుకోలేం.
ఉపయోగించుకోవాలి.
అంతే! ఇదే నీరు చెప్పిన పాఠం.