ఓ చిన్నమాట!
పేజర్ నుంచి...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
1995 సంవత్సరంలో తిరిగి హైదరాబాద్‌కి బదిలీ అయి వచ్చినప్పుడు, ఓ రోజు మా కజిన్ మహేశ్ మా ప్లాట్‌కి వచ్చాడు. వాడి నడుముకి వున్న బెల్ట్‌కి ఓ దీర్ఘ చతురస్రంలో ఓ పరికరం కన్పించింది. కాస్సేపు మాట్లాడిన తరువాత ఏదో శబ్దం వచ్చింది. అది ఆ పరికరాన్ని తీసి అందులోని నెంబర్‌ని నోట్ చేసుకొని ఆ నెంబర్‌కి మా ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తరువాత దాని గురించి తెలుసుకున్నాను. అది పేజర్. అది సెల్‌ఫోన్లు ఇంకా రాని కాలం. అప్పుడు పేజరే ఓ సమాచార కేంద్రం. మనిషిని అందుకోవడానికి వున్న ఏకైక సాధనం.
తరువాత ఎన్నో మార్పులు వచ్చాయి. మొబైల్ ఫోన్లు వచ్చాయి. మనకి కాల్ వస్తే కూడా డబ్బులు ఖర్చు అయ్యేవి. ఆ తరువాత కొంత మనం ఫోన్ చేస్తేనే డబ్బులు ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇంకా కొన్ని రోజులకి పరిస్థితి మరింత మెరుగుపడింది. కొన్ని నెంబర్లకి ఎంతసేపు మాట్లాడినా డబ్బులు ఖర్చు కాని పరిస్థితి వచ్చింది. ఇట్లా ఎన్నో మార్పులు వచ్చి, చివరికి స్మార్ట్ ఫోన్ మనుషుల చేతికి వచ్చింది. మొబైల్ డేటా వచ్చింది.
మనిషి తనను తాను మర్చిపోయాడు.
ప్రతి విషయానికి మొబైల్ ఫోన్ మీదే ఆధారపడుతున్నాడు.
చేతి గడియారం, టెలిఫోన్ డైరీ, అడ్రసులు, కాలిక్యులేటర్ లాంటివన్నీ అవసరం లేని వస్తువులై పోయాయి. ఇవే కాదు మరెన్నింటికో ఆ పరిస్థితి వచ్చేసింది.
రాత్రి నిద్రపోయే ముందు మనిషి చివరిసారిగా చూసేది మొబైల్ ఫోనే. అందులో వీడియోలు కావొచ్చు. వాట్సప్ సందేశాలే కావొచ్చు. మరేదో కావొచ్చు. ఉదయం లేవగానే మనిషి చేస్తున్న పని అదే.
మిత్రుల ఫోన్ నెంబర్లు, సన్నిహితుల నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది.
జ్ఞాపకశక్తి అంతరించే పరిస్థితి ఏర్పడింది. జ్ఞాపకశక్తిని విమర్శించే పరిస్థితి ఏర్పడింది.
ఇది కాల ప్రభావమా?
మనిషి తెచ్చుకున్న పరిస్థితా?