ఓ చిన్నమాట!
కొటేషన్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట.....
===========
మేజిస్ట్రేట్ ఉద్యోగంలో చేరిన తరువాత కొంత కాలానికి జ్యుడీషియల్ అకాడెమీకి ట్రైనింగ్‌కి పంపించారు. అక్కడ ఒక రోజు ఓ క్లాస్ జరిగింది. ఆ క్లాస్ తీసుకున్న వ్యక్తి 30 సంవత్సరాలు ఉంటాయేమో. మనస్సుని అదుపులో వుంచుకోవడం గురించి అతను క్లాసు తీసుకున్నాడు.
ఉదయానే్న మనం లేచినప్పుడు మనం చదువుకోవాల్సిన ఓ నాలుగైదు చరణాలు చెప్పాడు. ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజుని నేను చాలా సద్వినియోగం చేసుకుంటాను. ఇలా ఉంటాయి ఆ చరణాలు. మా మిత్రులు నవ్వుకున్నారు. అలా ఆశావహంగా రాసుకొని చదువుకుంటే ఆ రోజు బాగుంటుందానని కూడా అనుకున్నారు.
ఓ సంవత్సరం తరువాత మళ్లీ కలిసినప్పుడు వాళ్ల అభిప్రాయంలో మార్పు వచ్చింది. అలా అనుకోవడం వల్ల కొంత మార్పు వుందని వాళ్లు అన్నారు. అది నిజమే.
ఆశావహంగా ఆలోచించడం, చదువుకోవడం చాలా అవసరమే. అట్లా అనుకోవడం వల్ల ప్రేరణ వస్తుంది. ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. మనకి కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. అది ఆరోగ్య సమస్యలు కావొచ్చు. వివాహ, ఉద్యోగ సమస్యలు కావొచ్చు. మంచిని తరచూ అనుకోవడం వల్ల మన జీవితం మీద గొప్ప ప్రభావం ఏర్పడుతుంది. రోజుకి రెండు మూడుసార్లు ఏవైనా ఆశావహ మాటలు చెప్పినప్పుడు, అనుకున్నప్పుడు మన ఆలోచనా ధోరణి కూడా మారుతుంది.
ప్రసిద్ధ వ్యక్తులు చెప్పిన కొటేషన్స్‌ని రాసి జేబులో ఉంచుకొని అప్పుడప్పుడు చదవాలి. లేదా స్మార్ట్ఫోన్‌లో చూసుకుంటూ వుండాలి. అవి మన మెదడుని మంచివైపు ఆలోచించే విధంగా ప్రభావితం చేస్తాయి.
ప్రసిద్ధ వ్యక్తుల కొటేషనే్స కాదు. గీతలోని చరణాలని, బైబిల్‌లోని వాక్యాలని, ఖురాన్‌లోని మాటలని ఎంపిక చేసుకుని చదువుకోవచ్చు.
కష్టకాలంలో కూడా ఇదే రకంగా ఆలోచించాలి.