తెలంగాణ

ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ ఇంట్లో సిట్ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ ఇంట్లో సిట్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. దీంతో
నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. శాలిబండ కార్పొరేటర్ ముజఫర్ 2012 చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నారు. మతపరమైన గొడవలకు దారి తీసిందన్న ఉద్దేశంతో అప్పట్లో పోలీసులు ముజఫర్‌పై చర్యలకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి ముజఫర్ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో కేసును పోలీసులు సిట్ అధికారులకు అప్పగించారు. ముజఫర్‌ను పట్టుకునే క్రమంలో ఇంటికి వెళ్లగా అతడు లేకపోవడంతో ఇతరులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. సిట్ అధికారులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.