ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్ విప్లవానికి వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 28: నిన్నటి వరకూ తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు గ్రామాలంటే పరిసర ప్రాంతాల వారికి తప్ప ఇతర ప్రాంతాల వారికి తెలిసింది చాలా తక్కువ. అది కూడా జీడిపప్పు, చేనేత ఉత్పత్తుల కేంద్రాలుగానే ఆ గ్రామాల పేర్లు చుట్టుపక్కల వారికి తెలుసు. కాని గురువారం నుండి ఆ గ్రామాలు డిజిటల్ విప్లవానికి వేదికలవుతున్నాయి. ఆ గ్రామాల్లో గురువారం నిర్వహించే భారీ బహిరంగ సభలో సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించనుండటంతో ఆ గ్రామాల పేర్లు అందరి నోళ్లలో నానుతున్నాయి. ఈ గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సారథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తిచేశారు. జంట గ్రామాల్లో ప్రతి ఇంటికి రూ. 149కే ఇంటర్‌నెట్, టివి, టెలిఫోన్ సౌకర్యాలు కల్పిస్తూ కనెక్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలకు 864 స్మార్ట్ ఫోన్లు, 1200 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు, తొమ్మిది వైఫై కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ గ్రామాలు ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటి నగదు రహిత గ్రామాలుగా గుర్తింపు పొందనున్నాయి. ఇప్పటికే రాష్ట్రాన్ని డిజిటల్ రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ఏపి ఫైబర్ గ్రిడ్ సహకారంతో 23,000 కిలోమీటర్ల మేర ఫైబర్ లైను పూర్తి చేశారు. అయితే ఈ గ్రామంలో పుట్టి అమెరికాలోని బర్కిలీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాల్మన్ డార్విన్ విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో మోరి, మోరిపోడు గ్రామాలు ఈ ఘనతను సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్మార్ట్ విలేజీలుగా గుర్తింపు పొందనున్నాయి. రాష్ట్రంలోనే మొదటి నగదు రహిత, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా సిఎం ప్రకటించనున్నారు.
మోరి చేనేతకు ఇక అంతర్జాతీయ గుర్తింపు
ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో మోరి చేనేత వస్త్రాలు తమ సత్తా చాటనున్నాయి. స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదరడంతో మోరి చేనేతలకు అంతర్జాతీయ మార్కెట్‌లో స్థానం దక్కనుంది. ఇంతవరకూ ఇక్కడ తయారయ్యే గద్వాల్, జరీ చీరలు, కుప్పడం, మనీ కుప్పడం చీరల అమ్మకాలు స్థానిక మార్కెట్లకే పరిమితమయ్యేవి.
జీడిపప్పు పరిశ్రమకు టెక్నాలజీ అనుసంధానం
తీరప్రాంతంలో లభించే జీడిగింజలతో పాటు, ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకునే జీడి గింజలతో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఈ గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. డిజిటల్ గ్రామం కావడంతో తమ వ్యాపారాలకు మంచి గిరాకీ ఉంటుందని స్థానికులు ఆనందిస్తున్నారు.
ఇంత పేరొస్తుందని ఊహించలేదు: ఎంపిపి లక్ష్మి సరస్వతి
తమ గ్రామానికి ఇంత పేరు వస్తుందని కలలో కూడా ఊహించలేదని సఖినేటిపల్లి ఎంపిపి పప్పుల లక్ష్మిసరస్వతి ఆనందం వ్యక్తం చేశారు. తమ ఊరు డిజిటల్ గ్రామంగా మారుతోందన్న నిజాన్ని నమ్మలేకపోతున్నానని డ్వాక్రా మహిళ శివజ్యోతి సంతోషం వ్యక్తం చేశారు.

చిత్రం... ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప. స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేస్తున్న డ్వాక్రా మహిళలు
బుధవారం మధ్యాహ్నం తిరుమలలో
శ్రీవారిని
దర్శించుకున్న రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ