Others

రొమాంటిక్ ఫీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హన్సిక స్క్రీన్‌మీద కనిపిస్తే -కుర్రకారు కలల్లో తేలిపోతుంటారు. హన్సిక అందంలో ఓ రొమాంటిక్ ఫీల్ ఉంటుందని కితాబిస్తుంటారు. అందుకే -్ఫలానా సినిమాలో హన్సిక చేస్తుందంటే చాలు.. ఆ సినిమామీద ఫోకస్ పెరిగిపోతుంటుంది. అయితే, ఇది ఒకందుకు ఆనందించే విషయమే అయినా, కెరీర్‌కు ఇబ్బంది కలిగించే అంశం కూడా అవుతోందని హన్సిక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన పేరు వాడుకుంటూ.. తనతో సినిమాలు రూపొందిస్తున్నట్టు ప్రకటనలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది బబ్లీ బ్యూటీ. నిఖిల్ హీరోగా తెలుగులో వచ్చిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రాన్ని తమిళంలో జివి ప్రకాష్‌కుమార్ హీరోగా రూపొందిస్తున్నారు. ఆ చిత్రంలో హన్సిక చేస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ విషయం హన్సిక దృష్టికి రావడంతో, ఆమె సీరియస్‌గా తీసుకుందట. తాను ఆ సినిమాలో చేయడం లేదని, ఆ సినిమా కోసం తనను ఎవరూ కనీసం సంప్రదించలేదని కూడా తెగేసి చెబుతోంది.