Others

అవకాశాలు అడుక్కోలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది హీరోయిన్లలో అవకాశాలు అడుక్కుంటే రాలేదు. ఇండస్ట్రీకి రావడంతోనే -అవకాశాలు వెల్లువెత్తాయి. దాంతో ప్రాజెక్టుల కోసం పట్టుబట్టి కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకపోయింది. పదేపదే ఫొటో షూట్‌లు చేయాల్సిన అగత్యమూ తప్పింది. నిజంగా ఇది గాడ్ గిఫ్ట్ అంటోంది అందాల హన్సిక. దేశముదురులో బన్నీతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించి, తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మైండ్‌ని టచ్ చేసిన హన్సిక -పదేళ్లకు పైగానే స్టార్‌డమ్‌ని కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకు పోటీలేని నాయికగా సెపరేట్ ట్రాక్‌మీద కెరియర్ బండి లాగిస్తోన్న హన్సిక -‘ఏ డేట్ విత్ అనుసూయ’తో ఈ నిజాన్ని బహిర్గతం చేసింది. నిజంగా నన్ను సినిమా ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేసి మరీ పిలిచింది. చాలామందిలా ఫొటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదు. దర్శకుడు పూరి పిలిచారు. ఫొటో షూట్ చేశారు. అదే ఇక్కడ తొలి ఫొటో షూట్. తరువాత వెనక్కి తిరిగి చూడలేదు అంటోంది పాలబుగ్గల చిన్నది. మరో విషయం ఏమంటే - సౌకుమార్యానికి ప్రతిరూపంలా కనిపించే ఈ చిన్నదాన్ని ఫ్రెండ్స్ అంతా టైమ్‌బాంబ్ అని పిలుస్తారట. పారితోషికం విషయంలో పక్కా కమర్షియల్ థాట్స్‌తోనే ఉంటుదని హన్సిక పేరుబడినా -ఔదార్యం విషయంలోనూ చాలామందికంటే పైస్థాయిలోనే ఉంది. అనాధలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హన్సిక సామాజిక సౌందర్యాన్నీ ఇక్కడ ప్రస్తావించాలి.