Others

నాకు నచ్చిన పాట- శివరంజని నవరాగిణి.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని పాటలు వినడానికి బావుంటాయి. కొన్ని పాటలు వినేకొద్దీ బావుంటాయి. కొన్ని పాటలుంటాయి. అవి ఒక్కసారి వింటే -జీవితమంతా వెంటాడుతుంటాయి. అది ఆ పాటలోని శబ్ద సౌందర్యం కావొచ్చు. భాషా సొగసు కావొచ్చ. సంగీత మాధుర్యం కావొచ్చు. ఇవన్నీ సరైన సమపాళ్లలో అమిరిన పాట మాత్రం -ఎప్పటికీ మనల్ని వీడిపోదు. అలాంటి వాటిలో ‘తూర్పుపడమర’ చిత్రంలోని ‘శివరంజని నవరాగిణి’ పాటను ప్రస్తావించుకోవచ్చు. ‘శివరంజనీ నవరాగిణీ/ వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృత వాహిని’ అంటాడు రచయిత. ఈ పాటంటే నాకు పిచ్చి ఇష్టం. ప్రేయసిని వర్ణిస్తూ ప్రియుడు పాడిన పాటగా అప్పట్లో ఇది సెనే్సషన్ సృష్టించింది. ‘ఆ కనులు పండువెనె్నల గనులు/ ఆ కురులు ఇంద్ర నీలాల వనులు/ ఆ వదనం అరుణోదయ కమలం/ ఆ అధరం సుమధుర మధుకలశం’ అంటూ సి నారాయణరెడ్డి ఒక అద్భుత అందాన్ని ఆవిష్కరించారు. మొదట మెల్లగా హాయిగా సాగే పాట, చివరికి తారాస్థాయికి చేరుతుంది. భావోద్వేగంలో ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ ‘జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహినీ జానకీ/ వేణుధరుని రథమదిరోహించిన విదుషీమణి రుక్మిణీ/ రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా/ లలిత లావణ్య ప్రియత సౌందర్య కవిత చండికా అంటారు సినారే. పదాల్లోని వేగం, శబ్దంలోని నాదం మొత్తం పాట కట్టిపారేస్తుంది మనల్ని. పాటకు తగిన సంగీతాన్ని అందించిన రమేష్‌నాయుడి ప్రతిభ ఒక ఎత్తయితే, అతకంటే మధురంగా గాఢతతో పాడిన ఎస్పీ బాలు మరో ఎత్తు. ఇంతటి అద్భుత గీతాన్ని తెరపై దర్శకరత్న దాసరి చిత్రీకరించిన విధానం అల్టిమేట్. పబ్లిక్ గార్డెన్‌లో జూబ్లీహాలు ముందున్న గార్డెన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. నరసింహరాజు, శ్రీవిద్యల హావభావాలు, వారి నటన అత్యద్భుతం. నలుపు తెలుపులో వచ్చిన ఈ చిత్రంలోని పాట ఎప్పటికీ మనల్ని వెంటాడుతుంటుంది.

-జి గౌరీగాయత్రి, హైదరాబాద్