Others

నాకు నచ్చిన చిత్రం-- శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణుకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదహారణాల తెలుగు చిత్రం. చారిత్రక అంశంతో కూడిన కథ కావడంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన చిత్రం. ఆనాటి కళాకారులు -తెలుగువారి శాసనాన్ని ఏకం చేయటానికే అన్నట్టు కలిసికట్టుగా పనిచేసి విజయపతాక ఎగురవేసిన చిత్రం. అదే -శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ. శంభూఫిలిమ్స్ పతాకంపై నిర్మాత దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి ఆసక్తి మేరకు ఎకె శేఖర్ దర్శకత్వం వహిస్తే, చిత్రానికి స్క్రీన్‌ప్లేను నారాయణ చౌదరి అందించటం గొప్ప విషయం. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు సాక్షిగా సుచంద్రసేన మహారాజు తన రాజ్యాన్ని తెలుగు జాతికి అంకితం చేసిన చందమే ఈ కథ. పింగళి నాగేంద్రరావు మాటలు-పాటలు చమత్కారంగా, శృంగారరస భరితంగా సమకూర్చగా, సంగీతాన్ని పెండ్యాల సమకూర్చారు. అనాగరికుడైన నాగ నిశుంభుడు వీరుడినన్న గర్వంతో మహారాజు సుచంద్రుడితో సంధికి బదులు వైరంతో మెలగటానికి మంత్రి మహేంద్రజిత్తు కారణం. తాను రాజ్యమేలాలన్న పన్నాగం పన్ని చివరకు నాగనిశుంభుడి చేతిలోనే ఎలా అంతమయ్యాడన్నది మూల కథ. ఇందులో యువరాజు వల్లభదేవుడిగా ఎన్టీ రామారావు, యువరాణి సుజాతగా జమున అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఆటవిక చక్రవర్తి నాగ నిశుంభునిగా ఎస్‌వి రంగారావు, నక్కజిత్తుల మహేంద్రజిత్తు మంత్రి పాత్రలో ముదిగొండ లింగమూర్తి తన రంగస్థల నటనా పాటవాన్ని సినీ జగత్తుకు తగిన రీతిగా అందించి రక్తికట్టించారు. నిశుంభ చక్రవర్తి భార్యగా ఛాయాదేవి, లంక రాకుమారుడిగా రేలంగి, గిరిజ వారివారి పాత్రలను తగిన రీతిన పోషించి మెప్పించారు. బలదేవుడిగా బాలయ్య, సుచంద్రుడి మంత్రిగా మిక్కిలినేని, బలదేవుని ప్రియురాలిగా నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి చక్కని నటనతో మెప్పించారు. కలిమి బలిమితోడై ఆంధ్ర మహాసామ్రాజ్యానికి శంకుస్థాపన ఘనంగా జరగటం, దైవసాన్నిధ్యంలో చిత్రం మొదలై అక్కడే శుఖాంతం కావటం ఈ సినిమాలో కొనసాగించిన చక్కని సంప్రదాయం. ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించిన ‘వసంత గాలికి’ పాట మరువలేం. చిత్రంలో మాటలు, పాటలు, సంభాషణలు, సాహిత్యం తెలుగువారి సంస్కారానికి అద్దంపడతాయి. తెలుగుదనం, తెలుగునానుడులు పండిత పామరుల్ని ఆకర్షించేలా దర్శకుడు శేఖర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

-విఆర్ రావు, హైదరాబాద్