Others

శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి, తెలుగువారంతా గర్వించే మహానుభావుడు పింగళి వెంకయ్య. దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచించినది బంకించంద్ర చటోపాధ్యాయ. దేశ ప్రజలంతా గౌరవించే జాతీయ గీతం ‘జనగణమన’ రచించింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్. ఈ ముగ్గురు మహానుభావుల గురించి తెలియచేస్తూ నిర్మించిన తెలుగు డాక్యుమెంటరీ చిత్రం ‘్భరత కీర్తిమంతులు’. ఈ డాక్యుమెంటరీ 2013 నంది అవార్డుల్లో బంగారు నంది అవార్డు సాధించింది. డాక్యుమెంటరీ నిర్మించిన నిర్మాత, దర్శకుడు నిట్టల గోపాలక్రిష్ణకు ఉత్తమ డాక్యుమెంటరీ బంగారు నందితోపాటు ఉత్తమ నిర్మాత అవార్డూ దక్కింది. ఇరవై నిమిషాలు కలిగిన డాక్యుమెంటరీలో వందేమాతరం గీతం రచించిన బంకించంద్ర చటోపాధ్యాయగా దర్శకుడు గోపాలక్రిష్ణ కనిపించటం మరో విశేషం. దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, తాపీ చాణక్య, వి మధుసూధనరావు, కె విశ్వనాథ్‌లాంటి వారివద్ద శిక్షణ పొందిన గోపాలక్రిష్ణ దర్శకుడిగా లక్ష్మణరేఖ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలా జయసుధను నాయికగా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ చిత్ర విజయంతో లక్ష్మణరేఖ ఇంటి పేరుగా మార్చుకొని లక్ష్మణరేఖ గోపాలక్రిష్ణగా మారారు. తర్వాత భలేకాపురం, మరో సీతకథ, పార్వతి మళ్ళీపుట్టింది, చిన్నారి చిట్టిబాబు, రాజస్థాన్ రౌడీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కామధేనువు, ఫ్రీడమ్ పార్క్, పర్యావరణ పరిరక్షణ మా బాధ్యత, అవయవదానం డాక్యుమెంటరీలకు గతంలో ‘నంది’ అవార్డులు సాధించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలు ప్రభుత్వ పథకాలను డాక్యుమెంటరీలుగా రూపొందించి దర్శకత్వం వహించారు. నంది అవార్డు సాధించిన ‘్భరత కీర్తిమంతులు’ డాక్యుమెంటరీలో బంకించంద్ర చటోపాధ్యాయ పాత్రలో దర్శకుడు గోపాలక్రిష్ణ ఇలా.

-పర్చా శరత్‌కుమార్ 9849601717