Others

తనయితే ఫ్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కో హీరోయిన్ ఒక్కోలా మాట్లాడుతూ అందరినీ తికమకెపెడుతుంటారు? అసలు వాళ్లా ఎందుకు మాట్లాడారోనని అర్థం చేసుకోవడం కష్టమే. అయితే ఆ మాటల వెనుక చాలా అర్థాలే ఉంటాయన్నది తరువాత తెలుస్తుంది. కన్నడ హీరోయిన్ ఐశ్వర్యమీనన్ తెలుసుగా.. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కనిపించలేదు కానీ డబ్బింగ్ చిత్రాల ద్వారా బాగానే పరిచయమైంది. ఈ అందగత్తె తన మార్కెట్ పెంచుకోవడానికి కొత్త కొత్త ఐడియాలను తెరపైకి తెస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే టార్గెట్‌గా పెట్టుకున్న ఐశ్వర్య.. కావాలనుకుంటే ఎంత గ్లామరైనా ఒలికించడానికి నాకు అభ్యంతరం లేదు. పైగా స్టార్ హీరోల సినిమాలైతే రెమ్యూనరేషన్ కూడా తీసుకోనంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చింది! తరువాత మాట మార్చి చిన్న మెలిక పెట్టింది. తాను తమిళ హీరో ఆర్య అయితేనే ఫ్రీగా చేస్తానని! మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే.. తాను కాలేజ్ డేస్ నుంచి ఆర్యకు వీరాభిమానినని, అందుకే తనతో అయితే ఫ్రీగా చేస్తానని అంటుంది. ఇప్పటికే ఆర్య తీస్తున్న సినిమాల గురించి తెలుసుకుని ఆ దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతుందట! ఎంతైనా ఐశ్వర్య గడుసుదే మరి!